Elephant Video: రూల్స్ పాటించకుంటే బైక్ ఫుట్‌బాల్ ఎగిరినట్లు ఎగురుతుంది.. ట్విటర్‌లో ట్రాఫిక్ డీసీపీ వీడియో.. నెటిజన్ల సరదా కామెంట్స్..

ఈ వీడియోను బెంగళూరులోని తూర్పు డివిజన్ ట్రాఫిక్ డీసీపీ కళా కృష్ణస్వామి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. దీనికి క్యాప్షన్.. ‘ ప్రధాన రహదారిపై వాహనాలు పార్కింగ్ చేయొద్దు’ అని రాశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Elephant Video: రూల్స్ పాటించకుంటే బైక్ ఫుట్‌బాల్ ఎగిరినట్లు ఎగురుతుంది.. ట్విటర్‌లో ట్రాఫిక్ డీసీపీ వీడియో.. నెటిజన్ల సరదా కామెంట్స్..

traffic rules

Elephant video: ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే పోలీసులు జరిమానాలతో కొరడా ఝుళిపించడం షరామామూలే. రహదారిపై బైక్ పార్కింగ్ చేసినా, నిబంధనలకు విరుద్ధంగా వాహనం నడిపినా, హెల్మెంట్ లేకుండా బైక్ నడిపినా, ఇలా ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధిస్తారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ ఏనుగు ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తింది. రోడ్డుపై వెళ్తున్న ఓ ఏనుగు.. రహదారిపై పార్క్ చేసిన బైక్ వద్దకు రాగానే ఉన్నట్లుండి తన ఆగ్రహాన్ని వెలిబుచ్చింది. బైక్ ను తన కాలితో ఓ తన్నుతన్నింది. ఇంకేముంది.. బైక్ ఫుట్ బాల్ ఎగిరినట్లు ఎగిరి రోడ్డుపక్కకు కొద్దిదూరంలో పడిపోయింది.

Viral Video: పెళ్లి కూతురును ఎత్తుకునేందుకు ప్రయత్నించిన పెళ్లి కొడుకు.. ఇద్దరూ ఎలా పడ్డారో చూడండి

ఈ వీడియోను బెంగళూరులోని తూర్పు డివిజన్ ట్రాఫిక్ డీసీపీ కళా కృష్ణస్వామి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. దీనికి క్యాప్షన్.. ‘ ప్రధాన రహదారిపై వాహనాలు పార్కింగ్ చేయొద్దు’ అని రాశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో షేర్ చేసిన కొద్ది గంటల్లోనే 3.5 లక్షల మంది వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.

 

ఓ నెటిజన్.. ఈ వీడియో మంచి సందేశాన్ని ఇస్తుంది. హాస్యంతో కూడిన వీడియోను పోలీసులు ఇలా కమ్యూనికేట్ చేయడం బాగుంది అంటూ కితాబిచ్చాడు. మరో నెటిజన్.. వ్యగంగా కామెంట్ చేశాడు. ఏనుగుకు పోలీస్ ఉద్యోగం ఇప్పించండి అంటూ పేర్కొన్నాడు. మరో నెటిజన్.. ఏనుగు ట్రాఫిక్ నిబంధనల అమలు డ్రైవ్‌లో ఉంది అంటూ పేర్కొన్నాడు. ఈ ఏనుగు సివిల్ డ్రస్‌లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ అంటూ మరో నెటిజన్ చమత్కరించాడు. బెంగళూరు రహదారులపై ఈ జంబో చాలా అవసరం అంటూ మరో నెటిజన్ రాశాడు. ఇలా ట్విటర్‌లో ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు హాస్యాన్ని జోడిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.