Apple iPhone 12 : ఐఫోన్ ఆర్టర్ చేస్తే..2 నిర్మా సబ్బులొచ్చాయి

ఆన్ లైన్ లో ఓ వ్యక్తి Apple iPhone 12 ఆర్డర్ చేస్తే రెండు నిర్మా సబ్బులు రావటం చూసి షాక్ అయ్యాడు.

Apple iPhone 12 : ఐఫోన్ ఆర్టర్ చేస్తే..2 నిర్మా సబ్బులొచ్చాయి

Orders Apple Iphone 12 Worth Rs 53000 Receives Nirma Soap

orders Apple iPhone 12 worth Rs 53000 receives Nirma soap : ఐఫోన్ ఆర్డర్ చేస్తే యాపిల్ జూస్ రావటం..లేదా ఇటుక ముక్కలు, సబ్బులు, బిస్కెట్ ప్యాకెట్స్ రావటం గురించి విన్నాం. అలాగే ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి రావటం జరుగుతుంటుంది. అది అమెజాన్ లో కావచ్చు.లేదా ఫిప్ కార్ట్ లో కావచ్చు. ఆన్ లైన్ ఆర్డర్స్ లో ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి రావటం జరుగుతుంటుంది. ఈక్రమంలో ఓ వ్యక్తి iphone 12 ఆర్డర్ చేస్తే అతనికి రెండు బట్టల సబ్బులు రావటంతో అతను షాక్ అయ్యాడు.

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో సిమ్రాన్‌పాల్ సింగ్ అనే వ్యక్తి రూ.51,000 విలువైన ఐఫోన్ 12 ఆర్డర్ చేశాడు. కొత్త ఐఫోన్ కోసం ఆశగా ఎదురుచూశాడు. పార్శిల్ రానే వచ్చింది.దాని కోసమే ఎంతో ఆశగా చూస్తే అతను సంతోషంతో ఎగిరి గంతేశాడు. పార్శిల్ తీసుకున్నాడు. కొత్త ఫోన్ వచ్చేసిందని సంతోషంలో ఉబ్బితబ్బిబ్బు అయిపోయాడు.ఆత్రంగా పార్శిల్ ఓపెన్ చేసి చూపి షాక్ అయ్యాడు. ఉత్సాహం అంతా నీరుగారిపోయింది.

Read more : ద్యావుడా : స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేస్తే సోన్ పాపిడి వచ్చింది

కొత్త ఫోన్ చూద్దామని ఒళ్లంతా కళ్లు చేసుకని గబగబా ఆత్రంగా పార్శిల్ ఓపెన్ చేసి చూస్తే షాక్…దాంట్లో ఐఫోన్ 12 (iphone 12) లేదు. రెండు నిర్మా సబ్బులు కనిపించాయి. పాపం ఏం చేయాలో అర్థం కాలేదు. గాబరా పడిపోయాడు. అయితే పార్శిల్ ఓపెన్ చేసేప్పుడు అతను చేసిన పని మంచిదే అయ్యింది. పార్శిల్ ఓపెన్ చేసేటప్పుడు సరదాగా గుర్తుగా ఉంటుందని తన పాత ఫోన్ తో వీడియో రికార్డ్ చేశాడు. అదే అతనికి చక్కటి సాక్ష్యం అయ్యింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్‌గా మారింది.

దీని గురించి సిమ్రాన్‌పాల్ సింగ్ మాట్లాడుతు..నేను ఐఫోన్ 12 ఆర్డర్ చేశాను. కానీ నాకొచ్చిన పార్శిల్‌లో రెండు నిర్మా సబ్బులు వచ్చాయి. దీంతో నేను ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌కు కాల్ చేశాను. తాను డెలివరీ పార్ట్‌నర్‌కు ఓటీపీ షేర్ చేయలేదు కాబట్టి అతనికి పార్శిల్ డెలివరీ అయినట్టు కాదు. అదే విషయాన్ని కస్టమర్ కేర్‌కు వివరించాడు. వెంటనే దీనిపై విచారణ మొదలుపెట్టింది ఫ్లిప్‌కార్ట్. పార్శిల్ డెలివరీ చేసిన వ్యక్తిని ఫ్లిప్‌కార్ట్ విచారించింది. చివరకు తప్పు తమదేనని తెలుసుకుని..ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేసిన ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌కు డబ్బుల్ని రీఫండ్ చేసింది. కస్టమర్ బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు వచ్చేశాయని తెలిపాడు.

Read more : Women Order IPhone: ఐఫోన్ ఆర్డ‌ర్ ఇచ్చిన మహిళ.. పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే షాక్!