Aircraft Vadodara Restaurant: విమానం లాంటి రెస్టారెంట్.. పెట్టుబడి రూ.1.40కోట్లు

గుజరాత్ లోని వడోదరా సిటీకి చెందిన ఈ విమానం టైపు రెస్టారెంట్ డోర్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. దీంతో ఇండియాలో ఇటువంటి వాటి సంఖ్య తొమ్మిదికి చేరింది.

Aircraft Vadodara Restaurant: విమానం లాంటి రెస్టారెంట్.. పెట్టుబడి రూ.1.40కోట్లు

Flight Trestaurent

Aircraft Vadodara Restaurant: అన్నింటిలాగా ఈ ఎయిర్‌క్రాఫ్ట్ టేకాఫ్ అవడం, ల్యాండ్ అవడం వంటివి చేయదు. కేవలం ఎయిర్‌క్రాఫ్ట్ థీమ్‌డ్ రెస్టారెంట్ మాత్రమే. గుజరాత్ లోని వడోదరా సిటీకి చెందిన ఈ విమానం టైపు రెస్టారెంట్ డోర్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. దీంతో ఇండియాలో ఇటువంటి వాటి సంఖ్య తొమ్మిదికి చేరింది.

ఎయిర్‌బస్ 320ను ఎందుకు పనికిరాని దశలో కొనుగోలు చేసిన యాజమాన్యం రూ.1.40కోట్లు వెచ్చించింది. బెంగళూరులోని కంపెనీ నుంచి కొనుగోలు చేసి వడోదరాకు తీసుకొచ్చింది. దానిని రెస్టారెంట్ గా డెవలప్ చేయగా ప్రస్తుతం దాని విలువ రూ.2కోట్లకు చేరింది. దాని కెపాసిటీ దాదాపు 102మంది.

ఇందులో కూర్చొని తింటుంటే విజిటర్స్ నిజమైన ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్న ఫీలింగే వస్తుందట. ఎయిర్ హోస్టెస్, టేకాఫ్ అనౌన్స్ మెంట్లు వినిపించడం వంటివి ఏర్పాటు చేయడంతో రియల్ ఎయిర్ క్రాఫ్ట్ ఫీలింగ్ తీసుకొచ్చారు. ఇందులో పంజాబీ, చైనీస్, కాంటినెంటల్, ఇటాలియన్, మెక్సికన్, థాయ్ ఫుడ్ వంటివి అందుబాటులో ఉన్నాయి.

 

…………………………… : ప్లీజ్ తక్కువ తినండి బాబు…కిమ్ వేడుకోలు

కస్టమర్లకు కొత్త, సరదా రెస్టారెంట్లు కావాలనుకుంటుండటంతో ఇలాంటి ఆలోచనలకు పునాది పడిందని చెప్తున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ లోపల సెన్సార్లు వంటివి ఇన్‌స్టాల్ చేసి ఉండటంతో స్టాఫ్ ని పిలిస్తే క్షణాల్లో వారికి మెసేజ్ వెళ్తుంది. యూనిఫామ్స్ లో వచ్చిన స్టాఫ్ సర్వ్ చేసి వెళ్లిపోతారు. రెస్టారెంట్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇచ్చే బోర్డింగ్ పాస్ కూడా ఫ్లైట్ టిక్కెట్ లాగే ఉండేలా ప్లాన్ చేశారు.

సూరత్ వెళ్తుండగా విమానాన్ని పోలి ఉన్న రెస్టారెంట్ చూశా. నా కుటుంబంతో కలిసి ఇక్కడకు వచ్చా. దీనిని చూస్తుంటే నిజంగా విమానంలో కూర్చున్నట్లుగానే ఉంది. అని ఓ కస్టమర్ చెప్తున్నాడు.