Anand Mahindra: “ఇండియా అంటే ఏంటో చాటి చెప్పావ్”

ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ స్వర్ణాన్ని సాధించింది. ఈ చారిత్రక విజయంతో దేశ ఖ్యాతిని యావత్ ప్రపంచానికి చాటింది. పలువురు నిఖత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. ట్వీట్‌తో మాట్లాడే బిజినెస్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఆమె కోసం ఓ పోస్టు పెట్టి ప్రశంసించారు.

Anand Mahindra: “ఇండియా అంటే ఏంటో చాటి చెప్పావ్”

Nand Mahindra

 

 

Anand Mahindra: ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ స్వర్ణాన్ని సాధించింది. ఈ చారిత్రక విజయంతో దేశ ఖ్యాతిని యావత్ ప్రపంచానికి చాటింది. పలువురు నిఖత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. ట్వీట్‌తో మాట్లాడే బిజినెస్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఆమె కోసం ఓ పోస్టు పెట్టి ప్రశంసించారు.

థాయ్‌లాండ్‌కు చెందిన జుటామస్ జిట్‌పాంగ్‌ను ఓడించి నిఖత్ జరీన్ బంగారు పతకాన్ని గెలుచుకోవడం భారతీయులందరికీ గర్వకారణం. నిఖత్ అద్భుత సాధించిన విజయానికి ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో నిఖత్‌ను అభినందించారు.

భారత బాక్సర్. ప్రపంచ ఛాంపియన్. 5-0తో విజయం సాధించింది. నువ్వు ఏమిటో, భారతదేశం ఏమిటో ప్రపంచానికి చెప్పినందుకు #NikhatZareenకు ధన్యవాదాలు” అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ లో పేర్కొన్నారు.

Read Also: మన టైం వచ్చేసింది – ఆనంద్ మహీంద్రా

మేరీ కోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్‌ఎల్, లేఖా కెసి తర్వాత ఈ ఘనత సాధించిన ఐదో భారతీయ మహిళా బాక్సర్‌గా నిఖత్ నిలిచింది.