Anand Mahindra : వావ్..చిటారుకొమ్మన ఉన్న కాయల్ని కూడా ఇంత ఈజీగా తెంపొచ్చా..ఆనంద్ మహేంద్ర ఫిదా

వావ్..చిటారుకొమ్మన ఉన్న కాయల్ని కూడా ఇంత ఈజీగా తెంపొచ్చా..అంటూ ఆనంద్ మహేంద్ర ఫిదా అయిపోయారు ఓ యువకుడి తెలివితేటలకు..

Anand Mahindra : వావ్..చిటారుకొమ్మన ఉన్న కాయల్ని కూడా ఇంత ఈజీగా తెంపొచ్చా..ఆనంద్ మహేంద్ర ఫిదా

Anand Mahindra

Anand Mahindra : ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహేంద్ర అంటే ఆయన చేసే బిజినెస్ ల కంటే ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసే వీడియోలే ఠక్కున గుర్తుకొస్తాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహేంద్ర వినూత్న టాలెంట్లను ప్రశంసిస్తుంటారు. వారి తెలివితేటకు ఫిదా అయిపోతుంటారు. ఎంతోమందికి సహాయం చేస్తుంటారు. అటువంటి ఆనంద్ మహేంధ్రా చూడటానికి సింపుల్ గానే కనిపించినా చక్కటి నైపుణ్యంతో చిటారు కొమ్మన ఉన్న కాయల్ని కూడా ఎంత ఈజీగా తెంపవచ్చో ఓ యువకుడు తెలివి తేటలకు సంబంధించి వీడియోను షేర్ చేశారు.

ఆనంద్ మహేంద్ర పోస్ట్ చేసిన వీడియోలో.. ఓ యువకుడు ప్లాస్టిక్ పైపులు, దారం, ప్లాస్టిక్ డబ్బాను ఉపయోగించి చెట్టుకున్న కాయలు తెంపే ఆసక్తికరమైన పరికరాన్ని తయారు చేశాడు. ఓ ఖాళీ ప్లాస్టిక్ బాటిల్ వెనక భాగంలో కట్ చేసి, దానికి క్రమ పద్ధతిలో తాడును భిగించి.. పైపుల సహాయంతో ఈజీగా జామ కాయలు తెంపటం చూస్తే వావ్..చిటారు కొమ్మన ఉన్న కాయల్ని ఇంత ఈజీగా తెంపవచ్చా? అని అనిపించకమానదు.

మరి మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్ వేసి..మీ తోటలోనో లేదా మీ పెరట్లోనో ఉన్న జామకాయల్ని, మామిడికాయలతో పాటు మిగితా కాయల్ని ఎలా తెంపవచ్చో తెలుసుకోండి..ఈ వీడియో చూసి ఫిదా అయిపోయిన ఆనంద్ మహేంద్రా ప్రజలు క్రమంగా తమ సృజనాత్మక ఆలోచనలకు పదును పెడుతూ.. కొత్త కొత్త పరికరాలు ఆవిష్కరిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.