Medical College : ఆనంద్ మహీంద్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ!.. ట్వీట్ వైరల్

ఈ సమస్యను అధిగమించేందుకు మహీంద్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ పెట్టేందుకు ఏమైనా అవకాశాలున్నాయా ? అనేది చూడాలంటూ.. . టెక్ మహీంద్రా చీఫ్ సీపీ గుర్నానిని ఆదేశించారు.

Medical College : ఆనంద్ మహీంద్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ!.. ట్వీట్ వైరల్

Anand Mahindra's

Anand Mahindra Mulls Opening Medical College : వైద్య విద్య చదివేందుకు విదేశాలకు ఎందుకు వెళుతున్నారు ? అందులో ప్రధానంగా ఉక్రెయిన్ కు ఎందుకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పుడిదే చర్చ జరుగుతోంది. ఉక్రెయిన్ పై రష్యా దేశం దాడులకు పాల్పడుతుండడంతో అక్కడున్న వైద్య విద్యార్థులు సొంత దేశాలకు వచ్చేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. విమానాల ద్వారా వారిని ఇండియాకు తిరిగి రప్పిస్తోంది. ఈ క్రమంలో… ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ తెగ వైర్ అవుతోంది. మన దగ్గర మెడికల్ కాలేజీల కొరత ఉందా ? మెడిసిన్ చదివేందుకు అంతమంది విద్యార్థులు అక్కడకు ఎందుకు వెళుతున్నారు. ? దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read More : Supreme Court:యుక్రెయిన్ పరిస్థితులు బాధాకరం..కానీ యుద్ధం ఆపేయమని పుతిన్‌ను ఆదేశించ‌గ‌ల‌మా? : ఎన్వీ రమణ

ఈ సమస్యను అధిగమించేందుకు మహీంద్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ పెట్టేందుకు ఏమైనా అవకాశాలున్నాయా ? అనేది చూడాలంటూ.. . టెక్ మహీంద్రా చీఫ్ సీపీ గుర్నానిని ఆదేశించారు. ఇతర దేశాలకు వైద్య విద్య చదివేందుకు ఎంతమంది విద్యార్థులు వెళుతున్నారో గణాంకాలను ఓ జాతీయ పత్రిక ప్రకటించిన విషయాన్ని కూడా ఆయన ట్వీట్ లో వెల్లడించారు. ఒకవేళ మెడికల్ కాలేజీ వస్తే.. అది హైదరాబాద్ లో వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే… హైదరాబాద్ శివారులోని జీడిమెట్ల ప్రాంగణంలో మహీంద్రా యూనివర్సిటీ ఉంది. మహీంద్రా ఆలోచన సక్సెస్ అయితే… హైదరాబాద్ క్యాంపస్ లో మెడికల్ కాలేజీ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు.

Read More : Roman Abramovich : పుతిన్‌తో సంబంధాలు.. రష్యన్‌ బిలియనీర్‌‌కు చిక్కులు…!

గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధానికి పాల్పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది చనిపోతున్నారు. ప్రాణాలు దక్కించుకోవడానికి లక్షలాది మంది వలసలు వెళ్లిపోతున్నారు. అందులో విద్యార్థులున్నారు. వేలాది మందిగా ఉన్న భారత విద్యార్థులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగను చేపట్టింది. నవీన్ అనే విద్యార్థి బాంబు దాడిలో చనిపోవడం, పంజాబ్ విద్యార్థి అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో అందరీలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. అయినా.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. అందరినీ సురక్షితంగా ఇండియాకు రప్పిస్తామని వెల్లడిస్తోంది.