Anand Mahindra : ఈ ఫొటోలో ఆనంద్ మహీంద్ర ఎక్కడున్నారు ?

పాత రోజుల చిత్రాన్ని పంచుకుని..తనలో ఉన్న టాలెంట్ ను మరోసారి బైట పెట్టారు ఆనంద్ మహీంద్ర. స్కూల్ బ్యాండ్ లో భాగంగా గిటారు వాయిస్తున్న ఓ ఫొటోను షేర్ చేశారు. ఇలా షేర్ చేశారో లేదో..అలా వైరల్ అయిపోయింది. మహీంద్ర టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

Anand Mahindra : ఈ ఫొటోలో ఆనంద్ మహీంద్ర ఎక్కడున్నారు ?

Anand

Anand Mahindra School Album : ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర..సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. తనకు సంబంధించినవి, ప్రేరణ కలిగించే..ఇతరత్రా వీడియోలను ఆయన అందులో పోస్టు చేస్తుంటారు. ఆయన పోస్టు చేసిన వీడియోలకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. తాజాగా…పాత రోజుల చిత్రాన్ని పంచుకుని..తనలో ఉన్న టాలెంట్ ను మరోసారి బైట పెట్టారు. స్కూల్ బ్యాండ్ లో భాగంగా గిటారు వాయిస్తున్న ఓ ఫొటోను షేర్ చేశారు. ఇలా షేర్ చేశారో లేదో..అలా వైరల్ అయిపోయింది. మహీంద్ర టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. గిటారు వాయిస్తున్న వీడియోను షేర్ చేయాలని కోరుతున్నారు పలువురు నెటిజన్లు. అయితే..ఆనంద్ మహీంద్రను గుర్తు పట్టడానికి నెటిజన్లు కష్టపడ్డారు.

Read More : Enjoys Eating : మొక్కజొన్న పొత్తుల్ని తొక్క తీసి మరీ తింటున్న ఏనుగు

అసలు విషయం :-

1973లో మళయాల చిత్రం ‘మారం’ సిన్మాలో ‘పాతినాలాం రావుదిత్తురు’ పాటను అద్భుతంగా ఆలపించిన పాట ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది ఆనంద్ మహీంద్ర దృష్టికి వచ్చింది. ఆనంద్‌ మహీంద్ర బాల్యమిత్రుడు నిక్‌దే ఈ వీడియో. దీంతో తన పాఠశాల జ్ఞాపకాలు మహీంద్రాలో మెదిలాయి. ఇంకేముంది..పాఠశాల రోజుల నాటి తీపి గుర్తులను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు నిక్ మలయాళంలో ఇంత స్పష్టంగా పాడుతారని ఊహించలేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read More : Dubai Lottery : ఉద్యోగం పోయి రోడ్డున పడ్డాడు… లాటరీ రూపంలో అదృష్టం వరించింది.

ఊటీలో ఉండగా..నిక్ తో తన చిన్ననాటి అనుభవాలను పంచుకున్నారు. నిక్ పాట పాడిన తీరు, ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఊటీలో తన చిన్ననాటి స్నేహితులు నాగు అండ్ ముత్తు (నికోలస్ హార్స్ బర్గ్, అతని సోదరుడు మైఖేల్) గుర్తు చేసుకున్నారు ఆనంద్. తాను జూనియర్ అయినా..ది బ్లాక్ జాక్స్ బృందంలో నిక్ చేర్చుకున్నారని తెలిపారు. ఫొటోలో మైక్ దగ్గర ఉన్నది నిక్. నిక్ కు ఎడమవైపున తనకిష్టమైన బీటిల్ బూట్స్ ధరించి ఉన్నదే ఆనంద్ మహీంద్ర. తన స్కూల్ బ్యాండ్ ఫొటోలను ఫ్యాన్స్ తో పంచుకోవడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.