Viral Video: పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఏనుగు.. వీడియో పోస్టు చేసిన ఆనంద్ మహింద్రా.. ప్రీతి జింటా ఏమందంటే..

పుట్టిన రోజు అంటే ఎవరికైనా ప్రత్యేకమే. పుట్టినరోజు నాడు కుటుంబ సభ్యులు, స్నేహితుల కోలాహలం మధ్య వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే కొందరు తమ ఇళ్లలో పెంచుకొనే పెంపుడు జంతువులకు కూడా పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తుంటారు. తమిళనాడులోని ఓ ఆలయంలో అఖిల అనే ఏనుగుకు స్థానికులు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు

Viral Video: పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఏనుగు.. వీడియో పోస్టు చేసిన ఆనంద్ మహింద్రా.. ప్రీతి జింటా ఏమందంటే..

Viral Video

Viral Video: పుట్టిన రోజు అంటే ఎవరికైనా ప్రత్యేకమే. పుట్టినరోజు నాడు కుటుంబ సభ్యులు, స్నేహితుల కోలాహలం మధ్య వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే కొందరు తమ ఇళ్లలో పెంచుకొనే పెంపుడు జంతువులకు కూడా పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తుంటారు. తమిళనాడులోని ఓ ఆలయంలో అఖిల అనే ఏనుగుకు స్థానికులు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో పెద్ద ప్లేట్ లో పలు రకాల పండ్లను ఉంచారు. ఏనుగును ముస్తాబు చేసి తీసుకొచ్చారు. అయితే ఆ ఏనుగు సంతోషంగా ఆ పండ్లను ఒక్కొక్కటికి తీసుకుంటూ తినేసింది. తినే సమయంలో పండు నోట్లో పెట్టుకోవటం.. సూపర్ అన్నట్లు తల ఊపటం కనిపించింది. ఏనుగు నవ్వుతెప్పించే చేష్టలతో ఉన్న వీడియోను మహింద్రా అండ్ మహింద్ర కంపెనీ చైర్మన్ ఆనంద్ మహింద్రా తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు.

ట్విటర్ లో పోస్టుచేసిన ఏనుగు వీడియోకు.. ‘మీ ముఖంలో ఈ వీడియో తక్షణమే చిరునవ్వు తెప్పిస్తుంది. ఏనుగు విలక్షణమైన స్వభావాన్ని నేను ప్రేమిస్తున్నాను. తలను పక్కకి ఆడిస్తూ ఏనుగు చేసిన చేష్టలు మీకూ ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయని’ ఆనంద్ మహింద్రా అన్నారు. తమిళనాడులోని తిరువనైకావల్ ఆలయంలో ఈ ఏనుగు బర్త్ డే వేడుకలు జరిగాయని అన్నారు. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్, వ్యాపారవేత్త ప్రీతి జింటాసైతం ఈ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసి.. వావ్ ! ఇది చాలా బాగుంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ వీడియోను దాదాపు ఏడు లక్షల మంది వీక్షించారు. వీరిలో పలువురు నెటిజన్లు సరదా కమెంట్ల చేస్తున్నారు.