Anand Mahindra ‘Natu Natu Song’ : ఆనంద్ మహీంద్రా ‘నాటు నాటు’సాంగ్ డ్యాన్స్ మామూలుగా లేదుగా..ఏం క్రియేటివీ.!!

ఆనంద్ మహేంద్రా ‘నాటు నాటు’సాంగ్ డ్యాన్స్ మామూలుగా లేదుగా..ఏం క్రియేటివీ..

Anand Mahindra ‘Natu Natu Song’ : ఆనంద్ మహీంద్రా ‘నాటు నాటు’సాంగ్ డ్యాన్స్ మామూలుగా లేదుగా..ఏం క్రియేటివీ.!!

Anand Mahindra RRR Natu Natu Song

Anand Mahindra RRR Natu Natu Song : ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డు సొంతం చేసుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR) నాటు నాటు పాట భారత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. ఈ నాటు నాటు పాట క్రియేట్ వెనుక దర్శకుడు రాజమౌళి కష్టం ఎంతగా ఉందో తెలిసిందే. మ్యూజిక్ కంపోజ్ తో పాటు కొరియోగ్రఫీ ఇలా అన్నీ ఈ పాటలో పత్యేకతలకు కొదువేలేదు.అటువంటి నాటునాటు పాటకు అలనాటి బ్రిటిష్-అమెరికన్ కామెడీ జంట లారెల్- హార్డీలు డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి..మూకీ చిత్రాల యుగంలో జంటగా వీరు సృష్టించిన కామెడీ అంతా ఇంతాకాదు. అటువంటి ఈ కామెడీ జంట ‘నాటునాటు’పాటకు డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుందో ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో చూస్తే భలే తమాషాగా అనిపించకమానదు.

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా(Anand Mahindra) తరచూ ట్విటర్‌లో సరికొత్త విషయాలు షేర్ చేస్తుంటారు. ఆయన నాటునాటు డ్యాన్స్‌ గురించి ఓ వీడియో పోస్టు చేశారు. ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ (Golden Globe) అవార్డును సొంతం చేసుకున్న ఈ ‘నాటునాటు’ మేనియా అంతా ఇంతా కాదు. ఈ పాటను క్రియేటివిటీగా షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా..(Anand Mahindra) షేర్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది.

ఈ వీడియోలో బ్రిటిష్-అమెరికన్ కామెడీ జంట లారెల్- హార్డీలు ఓ పాటకు కలిసికట్టుగా స్టెప్పులు వేస్తున్నారు. వారి పాట స్థానంలో నాటు నాటు పాటను సింక్‌ చేయడం భలే తమాషాగా ఉంది. RRR విడుదలైనప్పుడే ఈ వీడియో వైరల్‌ అయినప్పటికీ.. తాజాగా గోల్డెన్‌ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న క్రమంలో ఆనంద్ మహీంద్రా షేర్ చేయటంతో మరోసారి ఈ ‘నాటునాటు మేనియా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలోని ఈ రెండు పాత్రల్లో RRR హీరోల్లో కనిపించినంత ఎనర్జీ ఉండకపోవచ్చు. అయినా పర్లేదు. ఎంజాయ్ చేయండి’ అంటూ పేక్కొన్నారు ఆనంద్ మహీంద్రా..