Duck-Tiger : పెద్ద పులిని ముప్పు తిప్పలు పెట్టిన టక్కరి బాతు..ఓ ఆట ఆడేసుకుంది..

ఓ చిట్టి బాతు మాత్రం పెద్దపులిని ముప్పు తిప్పలు పెట్టింది. నీటిలో Iఉన్న అంత పెద్ద పులిని ఓ ఆట ఆడుకుంది టక్కరి బాతు. చిన్న బాతు ఇదెంత? దీని ప్రాణమెంత? అన్నట్లుగా ఓ పులి బాతుని చటుక్కున పట్టేసుకుని లటుక్కున తినేద్దామనుకుంది. కానీ పులి ఉన్నది అడవిలో కాదు నీటిలో..దీంతో నీటిలో ఉన్న ఆ బాతు తనను పట్టేసుకుని తినేద్దామనుకున్న పులికి చుక్కలు చూపించింది.

Duck-Tiger : పెద్ద పులిని ముప్పు తిప్పలు పెట్టిన టక్కరి బాతు..ఓ ఆట ఆడేసుకుంది..

Duck Dodging Tiger Attack

A duck dodging tiger attack : పెద్ద పులిని చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. కానీ ఓ చిట్టి బాతు మాత్రం పెద్దపులిని ముప్పు తిప్పలు పెట్టింది. నీటిలో పులిని ఓ ఆట ఆడుకుంది టక్కరి బాతు. చిన్న బాతు ఇదెంత? దీని ప్రాణమెంత? అన్నట్లుగా ఓ పులి బాతుని చటుక్కున పట్టేసుకుని లటుక్కున తినేద్దామనుకుంది. కానీ పులి ఉన్నది అడవిలో కాదు నీటిలో..దీంతో నీటిలో ఉన్న ఆ బాతు తనను పట్టేసుకుని తినేద్దామనుకున్న పులికి చుక్కలు చూపించింది.

ఓ నీటి గుంటలో ఓ పెద్దపులి, ఓ బాతు ఉన్నాయి. ఆ పులి నేను పెద్దపులిని కదా..ఈ బాతును టక్కున పట్టేసుకుందామనుకుంది. అలా బాతు దగ్గరకెళ్లి పట్టుకుందామని యత్నించింది. కానీ బాతు ఊరుకుంటుందా? పైగా అది టక్కరిది..పైగా చిలిపి బాతులా ఉంది. వెంటనే బుడుంగున నీటిలో మునిగిపోయి పులి వెనుక తేలింది. తన వెనుకే ఉన్న బాతును పట్టుకుందామని పులి మరోసారి యత్నించింది. కానీ ఈ టక్కరి బాతు చిక్కుతుందా ఏంటీ? మళ్లా బుడుంగున నీటిలో మునిగి మళ్లీ పులి వెనుకాల తేలింది. పులి అహం దెబ్బతింది.

ఈసారి ఏమైనా సరే పట్టేసుకోవటం ఖాయం..ఈ బాతు నాకు ఆహారం అయిపోవటం అంతకంటే ఖాయం అనుకుంటూ మరోసారి పట్టుకోవటానికి ట్రై చేసింది. కానీ బాతు మాత్రం చిక్కలేదు. పులికి చుక్కలు చూపెట్టింది.అలా పులి తనకంటే ఎన్నో రెట్లు పెద్దదే అయినా..బలమైనదే అయినా..స్థాన బలిమి అంటారే అలా నీటిలో ఉన్న పులిని నీటిలోనే ఎక్కువ జీవించే బాతు ఓ ఆట ఆడేసుకుంది.ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.