Anand Mahindra : మానవత్వం బతికే ఉంది, ఆనంద్ మహీంద్రా వీడియ

ఓ మహిళ కూరగాయాలు విక్రయిస్తోంది. ఈ క్రమంలో..ఓ నెమలి ఆమె దగ్గరకు వచ్చి నిల్చొంది. వచ్చిన నెమలికి ఆహారం తినిపిస్తోంది. కొన్ని గింజలను ఇవ్వగా..నెమలి వాటిని తినేసింది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు ఫొటో, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో ఆనంద్ దగ్గరకు చేరింది.

Anand Mahindra : మానవత్వం బతికే ఉంది, ఆనంద్ మహీంద్రా వీడియ

Mahindra

Woman Feeding Peacock : మానవత్వం బతికే ఉంది అంటున్నారు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే..ఈయన వివిధ అంశాలకు చెందిన వాటిపై స్పందిస్తుంటారు. అంతేగాకుండా ట్విట్టర్ వేదికగా పలు వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తుంటారు. ఈయన చేసే పోస్టులకు తెగ రెస్పాన్స్ వస్తుంటుంది. ఫన్నీ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ..ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఈయన పోస్టు చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఓ ప్రాంతంలో ఓ మహిళ కూరగాయాలు విక్రయిస్తోంది. ఈ క్రమంలో..ఓ నెమలి ఆమె దగ్గరకు వచ్చి నిల్చొంది. వచ్చిన నెమలికి ఆహారం తినిపిస్తోంది. కొన్ని గింజలను ఇవ్వగా..నెమలి వాటిని తినేసింది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు ఫొటో, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో ఆనంద్ దగ్గరకు చేరింది. దీంతో ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. కొన్ని ఘటనలు చూస్తుంటే..ఇంకా మానవత్వం బతికే ఉంది…ఇన్ క్రెడిబుల్ ఇండియా అంటూ ఆయన ట్వీట్ లో వెల్లడించారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెట్లిజన్లు కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఆ మహిళను మెచ్చుకుంటున్నారు. ఇటీవలే టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా బంగారు పతకం గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ నెటిజన్ సార్..ఎక్స్ యూవీ 700 వెహికల్ ను గిఫ్ట్ గా ఉవ్వండి అంటూ ఆనంద్ మహీంద్రాను కోరారు. వెంటనే ఆయన స్పందించారు. ఎక్స్ యూవీ 700 వెహికల్ ను నీరజ్ కోసం సిద్ధంగా ఉంచాలంటూ…కంపెనీ ఎగ్జిక్యూటివ్ ను ఆ పోస్టులో టాగ్ చేశారు ఆనంద్.