హ్యాట్సాఫ్ మహిళా బెటాలియన్: ఎమ్మెల్యే ట్వీట్.. ఆనంద్ మహింద్ర రియాక్షన్

  • Published By: vamsi ,Published On : August 28, 2019 / 05:59 AM IST
హ్యాట్సాఫ్ మహిళా బెటాలియన్: ఎమ్మెల్యే ట్వీట్.. ఆనంద్ మహింద్ర రియాక్షన్

సోషల్ మీడియాలో సెటైరికల్ ట్వీట్లతో.. సరదా సంబాషణలతో.. అప్పడప్పుడూ సామాజిక విషయాలను ప్రస్తావిస్తూ యాక్టివ్ గా ఉండే మహింద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్ర లేటెస్ట్ గా నాగాలాండ్ ఉమెన్ బెటాలియన్ ను ప్రశంసిస్తూ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నాగాలాండ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మొన్లుమో కికోన్ ఆనంద్ మహింద్రను ట్యాగ్ చేస్తూ.. కొండ చరియల్లో రోడ్డు ప్రక్కన గుంటలో ఇరుక్కున్న మహింద్రా కారును తమ చేతులతో బయటకు తీస్తున్న నాగాలాండ్ మహిళా బెటాలియన్ ల వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఇది పాత వీడియోనే కానీ చాలా మంది చూడాలనే ఉద్ధేశ్యంతో మళ్లీ పోస్ట్ చేస్తున్నాను. ఇది వీలైనంత ఎక్కువమందికి చేరాలి అంటూ.. ఆనంద్ మహింద్రా, క్రీడా శాఖా మంత్రి కిరణ్ రిజుజు, హోంమంత్రి అమిత్ షా, స్మృతీ ఇరానీలను ట్యాగ్ చేస్తూ.. వీడియోని పోస్ట్ చేశారు.

ఎమ్మెల్యే ట్వీట్ పై స్పందించిన ఆనంద్ మహింద్ర..  బొలెరో గుంటలో ఎందుకు పడిందో నాకైతే తెలియదు. కానీ నాగా బెటాలియన్ కు చెందిన స్త్రీలు దానిని కాపాడటానికి ప్రయత్నించడాన్ని చూసి నేను సంతోషిస్తున్నాను. అంతేకాదు నాగ ఉమెన్ బెటాలియన్‌ను తక్కువ అంచనా వేసేంత మూర్ఖుడిని నేను కాదు. అంటూ రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.