WHO చీఫ్ హెచ్చరికలపై ఆనంద్ మహీంద్ర స్పందన అదుర్స్

  • Published By: venkaiahnaidu ,Published On : September 8, 2020 / 06:57 PM IST
WHO చీఫ్ హెచ్చరికలపై ఆనంద్ మహీంద్ర స్పందన అదుర్స్

కరోనా… చివరి మహమ్మారి కాదని, తరువాత మరిన్ని మహమ్మారులు దాడి చేసే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రేయేసస్ హెచ్చరికలపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు.

మళ్లీ నిరాశకు గురి చేసేముందు, ప్రస్తుత మహమ్మారి సంక్షోభం నుంచి బయటపడనివ్వండి అంటూ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. కరోనా నుంచి తేరుకోక ముందే మమ్మల్నందర్నీ మళ్లీ డిప్రెషన్ లో ముంచొద్దంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆయన ట్వీట్ కు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. రీటీట్లు, లైక్స్, వ్యంగ్యోక్తులతో హోరెత్తిస్తున్నారు.


కరోనా విషయంలో అధ్యక్ష ప్రసంగాలు తప్ప టెడ్రోస్ చేసిందేమీ లేదని ఓ యూజర్ కామెంట్ చేయగా,భయానక సీక్వెల్స్‌తో ఉన్న హారర్ సినిమాను తలపిస్తోందని మరో యూజర్ వ్యాఖ్యానించగా, జనాన్ని భయపెట్టే బదులు డబ్ల్యూహెచ్ఓ పరిష్కారాలు సూచించాలని మరో యూజర్ కోరారు. కరోనాతో వారు మేకింగ్ ఫన్ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు.

కాగా, కరోనా… చివరి మహమ్మారి కాదని, తరువాత మరిన్ని మహమ్మారులు దాడి చేసే అవకాశం ఉందని , మహమ్మారి అనేది జీవిత సత్యం అని చరిత్ర మనకు బోధిస్తుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ మంగళవారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే తదుపరి మహమ్మారిని మెరుగైన రీతిలో ఎదుర్కోవటానికి ప్రజారోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని, ప్రపంచ దేశాలు ప్రజారోగ్యంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.