Anant Ambani Engagement: వైభవంగా అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ నిశ్చితార్థం.. అంబానీ నివాసంలో జరిగిన వేడుక

ముకేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ముంబైలోని అంబానీ నివాసంలో సంప్రదాయబద్ధంగా ఈ వేడుక జరిగినట్లు అంబానీ కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది. ముకేష్ అంబానీ-నీతా దంపతుల రెండో కుమారుడు అనంత్ అంబానీ.

Anant Ambani Engagement: వైభవంగా అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ నిశ్చితార్థం.. అంబానీ నివాసంలో జరిగిన వేడుక

Anant Ambani Engagement: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ముంబైలోని అంబానీ నివాసంలో సంప్రదాయబద్ధంగా ఈ వేడుక జరిగినట్లు అంబానీ కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది.

Nora Fatehi: గల్‌ఫ్రెండుగా ఉంటే ఖరీదైన ఇల్లు ఇస్తానన్నాడు.. సుకేష్ చంద్రశేఖర్‌పై నోరా ఫతేహి ఆరోపణ

ముకేష్ అంబానీ-నీతా దంపతుల రెండో కుమారుడు అనంత్ అంబానీ. వీరేన్ మర్చంట్-శైల దంపతుల కుమార్తె రాధికా మర్చంట్. అనంత్-రాధిక ఒకరికొకరు చాలా కాలంగా పరిచయం. దీంతో ఇరు కుటుంబాలు వీరి వివాహానికి అంగీకరించాయి. ఈ నేపథ్యంలో నిశ్చితార్థ వేడుక, గుజరాతీ సంపద్రాయమైన గోల్ ధన, చునారివిధి వంటి కార్యక్రమాల్ని కూడా ఈ సందర్భంగా నిర్వహించారు. ఇవి పెళ్లికి ముందు జరుపుకొనే సంప్రదాయ వేడుకలు. గోల్ ధన అంటే బెల్లం, కొత్తిమీర గింజలతో జరుపుకొనే వేడుక. వరుడి ఇంట్లో గోల్ ధన్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి వధువు కుటుంబం బహుమతులు, స్వీట్లు తీసుకుని వస్తారు. అనంతరం ఇరు కుటుంబాలు స్వీట్లు పంచుకుంటారు.

Rakhi Sawant: హాట్ బ్యూటీ రాఖీ సావంత్ అరెస్ట్.. ఎందుకో తెలుసా?

తర్వాత అనంత్-రాధిక ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. అనంతరం పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ముందుగా రాధికను తన కుటుంబంలోకి ఆహ్వానించేందుకు సాయంత్రం అంబానీ కుటుంబం నుంచి ఇషా అంబానీ, రాధిక ఇంటికి వెళ్లారు. అక్కడ అంబానీ కుటుంబానికి రాధిక కుటుంబం ఘన స్వాగతం పలికింది. అనంతరం వీళ్లంతా కలిసి అంబానీ నివాసానికి చేరుకున్నారు. అంబానీ నివాసంలో వారికి ఘన స్వాగతం పలికారు. అంబానీ ఇంట్లో నిశ్చితార్థ వేడుక జరిగింది. అనంతరం ఇరు కుటుంబాలు కలిసి కృష్ణుడి ఆలయానికి వెళ్లి ఆశీర్వాదాలు తీసుకున్నారు.