పార్లర్ లో విసిగించిన కష్టమర్..ముఖంపై వాషర్ తో నీళ్లు కొట్టిన హెయిర్ డ్రెస్సర్ | Hairdresser Angry

Hairdresser Angry : పార్లర్ లో విసిగించిన కష్టమర్..ముఖంపై వాషర్ తో నీళ్లు కొట్టిన హెయిర్ డ్రెస్సర్

బ్యూటీ పార్లర్ లో ఓ మహిళకు హెయిర్ డ్రెస్సర్ హెడ్ బాత్ చేస్తున్నాడు. అదే సమయంలో ఆమె పదే పదే అటూ ఇటూ తిరుగుతూ విసిగిస్తోంది. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఇష్టమొచ్చినట్లుగా చేస్తున్న సదరు ఆమెపై చిర్రెత్తుకొచ్చింది ఆ హెయిర్ డ్రెస్సర్ కు. దాంతో హ్యాండ్ షవర్ తో నీటిని ఆమె ముఖంపై ఫోర్సుగా కొట్టేసాడు. దీంతో ఆమెకు దిమ్మ తిరిగిపోయింది.

Hairdresser Angry : పార్లర్ లో విసిగించిన కష్టమర్..ముఖంపై వాషర్ తో నీళ్లు కొట్టిన హెయిర్ డ్రెస్సర్

Hairdresser Angry : యువతులు, మహిళలు బ్యూటీ పార్లరు వెళ్లటం సర్వసాధారణంగా మారిపోయింది. హెయిర్ కట్, హెయిర్ కేర్ కోసం హెహిందీ పెట్టుకోవటం, ఫేషియల్, పెడిక్యూర్ ఇలా ఎన్నో చేయించుకుంటారు పార్లర్ లో. హెయిర్ కు రకరకాల కలర్స్ కూడా వేయించుకంటున్నారు చాలామంది. దాని కోసం కూడా పార్లర్ కు వెళుతుంటారు. అలా బ్యూటీ పార్లర్ కు వెళితే..పేద్ద క్యూ ఉందనుకోండి…మన పని త్వరగా కానిచ్చుకుని ఎప్పుడు వచ్చేద్దామా? అనిపిస్తుంది చాలామందికి. కానీ కొంతమంది అలాకాదు. చక్కగా అక్కడ ఎంజాయ్ చేస్తుంటారు. బ్యూటీషియన్స్ తాము చెప్పిన పని చేస్తుంటే అప్పుడు కూడా వెర్రి వెర్రి వేషాలు వేస్తుంటారు.

బ్యూటీషియన్స్ తమకు అప్పగించిన పనిచేస్తుంటే..ఫోన్లు చూసుకంటూ పక్కవాళ్లతో మాట్లాడుతూ..తల అటూ ఇటూ తిప్పుతూ నానా హడావిడి చేస్తూ స్టైల్ చూపింస్తుంటారు. పాపం ఆ బ్యూటీషియన్స్ మాత్రం కష్టమర్లు ఎంత విసిగించినా సహనంతో తమ పని చేస్తుంటారు. కానీ ఓ మహిళ చేసిన పనికి పాపం సదరు బ్యూటీషియన్ కు తిక్కలేచింది. పదే పదే సదరు కష్టమర్ పదే పదే విసిగిస్తుంటే భరించలేకపోయాడు. అంతే హెయిర్ వాష్ చేస్తుంటే సదరు మహిళ కుదురుగా ఉండకుండా అస్తమానూ లేస్తూ ఫోన్ తో హడావిడి చేస్తుంటే అతనికి చిరాకొచ్చింది. అంతే..ఆమె తలను వెనక్కి గుంచి మొహంమీద చేతిలో ఉన్న హ్యాండ్ షవర్ తో ఆమె ముఖంమీద నీళ్లు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఇద్దరు మహిళలు పార్లర్ కు వచ్చారు. కూడా వారి పెంపుడు కుక్కను కూడా తీసుకొచ్చారు.వారిద్దరూ ఫేస్ ప్యాక్ వేయించుకున్నారు. ఫేస్ కు ప్యాక్ ఉండగానే ఓ మహిళ హెడ్ బాత్ చేయించుకుంటోంది. సదరు హెయిర్ డ్రెస్సర్ ఆమె తలను వాష్ చేస్తుండగా ఆమె పదే పదే పైకి లేస్తోంది. పక్కామె ఇచ్చిన ఫోన్ చూసుకుంటూ అస్తమానూ పైకి లేస్తుంటే..పాపం అతనికి హెడ్ బాత్ చేయటం కుదరటం లేదు. అలా ఒకటి రెండు సార్లు వెనక్కి వంచి హెయర్ వాష్ చేస్తున్నాడు. కానీ ఆమె అస్తమానూ లేవటంతో చిరాకొచ్చింది. కోపమొచ్చింది. అంతే హ్యాండ్ వాషర్ తో ఆమె ముఖంమీద నీళ్లు ఫోర్స్ గా కొట్టాడు.దానికి ఆమెతో పాటు పక్కన కుక్కను ఒడిలో పెట్టుకుని కూర్చున్న మహిళ కూడా షాక్ అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

×