Angry With Son: కొడుకు మీద కోపంతో రూ.2.5కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి..

ఒడిశాలోని ఓ మహిళ రిక్షా నడిపే వ్యక్తికి ఆస్తిని రాసిచ్చేసింది గుర్తుంది కదా.. అలానే 83ఏళ్ల వ్యక్తి కొడుకు మీద కోపంతో ఆస్తిని ప్రభుత్వానికి ఇచ్చేస్తానంటూ వీలునామా రాశాడు....

Angry With Son: కొడుకు మీద కోపంతో రూ.2.5కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి..

Property Will

Angry With Son: ఒడిశాలోని ఓ మహిళ రిక్షా నడిపే వ్యక్తికి ఆస్తిని రాసిచ్చేసింది గుర్తుంది కదా.. అలానే 83ఏళ్ల వ్యక్తి కొడుకు మీద కోపంతో ఆస్తిని ప్రభుత్వానికి ఇచ్చేస్తానంటూ వీలునామా రాశాడు. గణేశ్ శంకర్ పాండే, తన పెద్ద కొడుకు ఆస్తి కోసం ఇబ్బంది పెడుతున్నాడంటూ పేర్కొంటూ తన ఆస్తి డాక్యుమెంట్లు సిటీ మెజిస్ట్రేట్ ప్రతిపాల్ సింగ్ కు అప్పగించారు.

‘పీపల్ మండీలోని నా 250 చదరపు గజాల ఆస్తిని జిల్లా మెజిస్ట్రేట్ కు అప్పగించేశా’నంటూ పాండే మీడియాతో అన్నారు. గణేశ్ శంకర్ పాండే తన ముగ్గురు తమ్ముళ్లతో కలిసి వెయ్యి చదరపు గజాల స్థలంలో 1983లో ఇళ్లు కట్టుకుని అక్కడే ఉంటున్నారు. ఆ తర్వాత ఆస్తిని మూడు భాగాలుగా విభజించుకున్నారు.

‘నా పెద్ద కొడుకు దిగ్విజయ్.. అతని భార్య, ఇద్దరు పిల్లలు నా ఇంట్లోనే ఉంటున్నారు. దిగ్విజయ్ పదేపదే ఆస్తిలో వాటా కావాలంటూ లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నారు. నాకు గౌరవమివ్వకుండా తప్పుగా ప్రవర్తిస్తున్నారు. అతణ్ని వ్యాపారం మీద ధ్యాస పెట్టమని చెప్పాను. కొన్నేళ్లుగా కష్టపడి పెంచిన వ్యాపారాన్ని లాక్కొనే ముందు దాని గురించి తెలుసుకోమని చెప్పా. అతను వినిపించుకోవడం లేదు. అందుకే ఆస్తిని మరణం తర్వాత ప్రభుత్వం ఇష్టానుసారం వాడుకోవచ్చని ఇచ్చేశా. అప్పటి వరకూ బతకడానికి నా దగ్గర డబ్బులున్నాయ్’ అని మెజిస్ట్రేట్ కు చెప్పాడట.

………………………………………… : 70వేల మంది సైనికుల‌కు క‌రోనా, 190 మంది మృతి

జిల్లా మెజిస్ట్రేట్ ప్రభు సింగ్ మాట్లాడుతూ.. ‘గణేశ్ శంకర్ పాండే విషయం గురించి తెలిసింది. అతని సరైన న్యాయం చేస్తాం. ఏదైనా కంప్లైంట్ చేస్తే దానికి తగ్గట్లు రియాక్షన్ తీసుకుని చట్ట ప్రకారం న్యాయం చేయాలనుకుంటున్నాం’ అని అన్నారు.