Pegasus Targets: అనిల్ అంబానీ, సీబీఐ మాజీ అధికారిపై పెగాసస్ టార్గెట్

కొన్ని రోజులుగా సంచలనం రేపుతున్న ఇజ్రాయెలీ స్పేస్‌వేర్ పెగాసస్ విషయంలో అనిల్ అంబానీ పేరు తెరమీదకు వచ్చింది. ట్యాపింగ్ చేసేందుకు ఫోకస్ పెట్టిన ఫోన్ల నెంబర్ల జాబితాలో రిలయన్స్‌ అడాగ్‌ గ్రూపు చైర్మన్‌ అనిల్‌ అంబానీకి చెందిన నెంబర్లు ఉన్నాయంటూ ‘ది వైర్‌’ రాసుకొచ్చింది.

Pegasus Targets: అనిల్ అంబానీ, సీబీఐ మాజీ అధికారిపై పెగాసస్ టార్గెట్

Muikesh Ambani

Pegasus Targets: కొన్ని రోజులుగా సంచలనం రేపుతున్న ఇజ్రాయెలీ స్పేస్‌వేర్ పెగాసస్ విషయంలో అనిల్ అంబానీ పేరు తెరమీదకు వచ్చింది. ట్యాపింగ్ చేసేందుకు ఫోకస్ పెట్టిన ఫోన్ల నెంబర్ల జాబితాలో రిలయన్స్‌ అడాగ్‌ గ్రూపు చైర్మన్‌ అనిల్‌ అంబానీకి చెందిన నెంబర్లు ఉన్నాయంటూ ‘ది వైర్‌’ రాసుకొచ్చింది. 36 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో భారీ కుంభకోణం జరిగిందంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే.

రాఫెల్‌ యుద్ధ విమానాలను తయారుచేసే సంస్థ డసాల్ట్‌కు ఇండియన్ పార్టనర్‌గా అనిల్‌‌కు చెందిన సంస్థను ఎంపిక చేశారని… దాని వెనుక ఆయన్ను ఆయాచిత లబ్ది చేకూర్చే ప్రయత్నం ఉందని ఆరోపణలు వచ్చాయి.

నిఘా జాబితాలో డసాల్ట్‌ ఏవియేషన్‌ భారత ప్రతినిధి వెంకటరావు పోసీన, బోయింగ్‌ ఇండియా బాస్‌ ప్రత్యూష్‌ కుమార్‌ల నెంబర్లు ఉన్నాయని వైర్‌ వెల్లడించింది. దలైలామా సన్నిహిత సలహాదారులపై నిఘా కొనసాగిందని వైర్‌ వెల్లడించింది. గురువారం.. ప్రభుత్వంతో విభేదాల అనంతరం సీబీఐ మాజీ డైరెక్టర్‌ అలోక్‌ వర్మను 2018లో పదవిలో నుంచి తొలగించగానే ఆయన ఫోన్‌పైనా నిఘా పెట్టారు.

ఈ పెగాసస్ స్కాండల్ ను వాటర్‌గేట్ కంటే పెద్దదిగా అభివర్ణిస్తుంది ప్రతిపక్షం. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్, ఇద్దరు కేంద్ర మంత్రులు, డజన్ల కొద్దీ జర్నలిస్టులు ఈ నిఘా జాబితాలో ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి.