Anil Ambani: బాంబే హైకోర్టులో అనిల్ అంబానీకి ఊరట.. నవంబర్ 17వరకు బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశం

రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీపై బ్లాక్‌ మనీ యాక్ట్‌ కింద విచారణ జరపాలని కోరుతూ షోకాజ్‌ నోటీసుపై నవంబర్‌ 17 వరకు ఎలాంటి నిర్బంధ చర్యలు తీసుకోవద్దని బాంబే హైకోర్టు సోమవారం ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది

Anil Ambani: బాంబే హైకోర్టులో అనిల్ అంబానీకి ఊరట.. నవంబర్ 17వరకు బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశం

Anil Ambani

Anil Ambani: రూ. 420కోట్ల పన్ను ఎగవేత వ్యవహారంలో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి బాంబే హైకోర్టులో ఉపశమనం లభించింది. నవంబర్ 17 వరకు అనిల్ అంబానీపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదాయపు పన్ను శాఖకు హైకోర్టు సూచించింది. రెండు స్విస్ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.814 కోట్లకుపైగా విలువైన అప్రకటిత నిధులపై రూ.420 కోట్ల పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ అంబానీని బ్లాక్ మనీ చట్టం కింద ఆదాయపు పన్ను శాఖ విచారించింది.

Congress Crisis: గెహ్లాట్ తీరుపై కాంగ్రెస్ కమిటీ ఆగ్రహం.. అధ్యక్ష రేసు నుంచి తప్పించాలంటూ…

63 ఏళ్ల అనిల్ అంబానీ ఉద్దేశపూర్వకంగా తన విదేశీ బ్యాంకు ఖాతా వివరాలను, ఆర్థిక ప్రయోజనాలను ఆదాయపు పన్నుశాఖ అధికారులకు వెల్లడించలేదని ‘ఉద్దేశపూర్వకంగా” ఎగవేతకు పాల్పడ్డారని ఆ శాఖ అభియోగాలు మోపింది. డిపార్ట్‌మెంట్ నోటీసు ప్రకారం.. అంబానీ బ్లాక్ మనీ (బహిర్గతం చేయని విదేశీ ఆదాయం, ఆస్తులు) 2015 పన్ను చట్టంలోని సెక్షన్ 50, 51 కింద ప్రాసిక్యూట్ చేయబడతారు. ఇది గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానాతో కూడిన శిక్షను నిర్దేశిస్తుంది. బ్లాక్ మనీ చట్టం 2015లో అమల్లోకి వచ్చిందని, 2006-2007, 2010-2011 అసెస్‌మెంట్ సంవత్సరాలకు చెందిన లావాదేవీలు అని పేర్కొంటూ, ఈ నోటీసును సవాలు చేస్తూ అంబానీ ఈ నెల ప్రారంభంలో హైకోర్టును ఆశ్రయించారు.

CM KCR – PK TEAM : ప్రశాంత్ కిషోర్ సర్వేలపై గులాబీ బాస్ అసంతృప్తి .. పీకే టీమ్‌కు కేసీఆర్ కటీఫ్ చెప్పారా?

అంబానీ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది రఫీక్ దాదా చట్టంలోని నిబంధనలు పునరాలోచనలో ప్రభావం చూపలేవని అన్నారు. ఐటీ శాఖ తరఫు న్యాయవాది అఖిలేశ్వర శర్మ ఈ పిటిషన్‌పై స్పందించేందుకు సమయం కావాలని కోరారు. న్యాయమూర్తులు ఎస్వీ గంగాపూర్వాలా, ఆర్‌ఎన్ లడ్డాలతో కూడిన డివిజన్ బెంచ్ అందుకు అనుమతినిస్తూ పిటిషన్‌ను నవంబర్ 17కి వాయిదా వేసింది. ఆదాయపు పన్నుశాఖ తదుపరి తేదీ వరకు షోకాజ్ నోటీసుకు అనుగుణంగా పిటిషనర్ (అంబానీ)పై ఎటువంటి బలవంతపు చర్య తీసుకోవద్దని కోర్టు పేర్కొంది.