బీజేపీకి అన్నా షాక్..ఆహ్వానం తిరస్కరణ

  • Published By: madhu ,Published On : August 29, 2020 / 10:35 AM IST
బీజేపీకి అన్నా షాక్..ఆహ్వానం తిరస్కరణ

బీజేపీకి ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే షాక్ ఇచ్చారు. ఆ పార్టీ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఢిల్లీలోన కేజ్రీవాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించనున్న సామూహిక ఉద్యమంలో పాల్గొనాలని అన్నాను బీజేపీ కోరింది.



ఈ మేరకు ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా ఆహ్వానం పంపారు. కానీ..దీనిని అన్నా ఒప్పుకోలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీ…ఉద్యమం కోసం ధనం లేని, 10 x 12 అడుగుల గదిలో నివసించే..83 ఏళ్ళ ఫకీర్ ను ఆహ్వానించడం దురదృష్టకరమని లేఖలో అన్నా వెల్లడించారు.
https://10tv.in/prabhas-practicing-archery-at-home-adi-purush/
అధికారం, ఉద్యమం కోసం ఇలా చేశారని తెలిపారు. అవినీతిపై ఉక్కు మోదం మోపాల్సిందేనని, దీనిని సమూలంగా నిర్మూలిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారని గుర్తు చేశారు.



ఒకవేళ ఢిల్లీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుంటే…కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారాయన. 2011లో ఢిల్లీలో అవినీతికి వ్యతిరేకంగా…హజారే ఉద్యమాన్ని నిర్వహించిందని, ఉద్యమం నుంచి పుట్టిన ఆప్..ఈ రోజు అవినీతిలో కూరుకపోయిందని..అందుకే ఆయన సహాయాన్ని కోరడం జరిగిందని ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా వెల్లడించారు.