దేశంలో మరో 12 ఒమిక్రాన్ కేసులు.. మధ్యప్రదేశ్ లో 8, ఒడిశాలో 4 గుర్తింపు

దేశంలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. మధ్యప్రదేశ్ లో 8, ఒడిశాలో 4 కేసులను గుర్తించారు. ఒడిశాలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 8కి చేరింది.

దేశంలో మరో 12 ఒమిక్రాన్ కేసులు.. మధ్యప్రదేశ్ లో 8, ఒడిశాలో 4 గుర్తింపు

Omicron

Another 12 Omicron cases in india : ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ భారత్ లోనూ కలవర పెడుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. మధ్యప్రదేశ్ లో 8, ఒడిశాలో 4 కేసులను గుర్తించారు. ఒడిశాలో వేరియంట్ కేసుల సంఖ్య మొత్తం 8కి చేరింది. భారత్ లో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 434కు చేరింది.

మహారాష్ట్రలో అత్యధికంగా 108, ఢిల్లీలో 79, గుజరాత్ లో 43, తెలంగాణలో 41, కేరళలో 38, తమిళనాడులో 34, కర్నాటకలో 31, రాజస్థాన్ లో 22 చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. కొత్త వేరియంట్ బారి నుంచి 130 మంది బాధితులు కోలుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Corona In France : ఫ్రాన్స్ లో కరోనా విలయ తాండవం.. ఒక్కరోజే లక్ష కేసులు నమోదు

దేశంలో ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్‌ వ్యాపించినట్టు తెలిపింది. ప్రస్తుతం దేశంలో డెల్టా వేరియంట్‌ కేసులే ఎక్కువగా ఉన్నప్పటికీ… ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందే లక్షణాన్ని కలిగి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాలు వేరియంట్ కట్టడిపై ఫోకస్ పెట్టాయి.

ప్రపంచదేశాలను ఒమిక్రాన్‌ వణికిస్తోంది. 108 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. ఇప్పటివరకు సుమారు లక్షన్నర మందికి ఈ వేరియంట్ సోకినట్లు అంచనా వేస్తున్నారు. ఒక్క యూకేలోనే 90 వేల కేసులు నమోదు అయ్యాయి. డెన్మార్క్‌లో మరో 30 వేలమంది దీని బారినపడ్డారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌తో 26మంది మృతి చెందారు.