Soumen Roy : ఉపఎన్నికల వేళ బీజేపీకి మరో షాక్

వెస్ట్ బెంగాల్ లో బీజేపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారు. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన..

Soumen Roy : ఉపఎన్నికల వేళ బీజేపీకి మరో షాక్

Soumen Roy

Soumen Roy : వెస్ట్ బెంగాల్ లో బీజేపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారు. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన కాసేపటికే బీజేపీకి ఊహించని షాక్‌ తగిలింది. మరో ఎమ్మెల్యే కాషాయ పార్టీని వీడి అధికార పార్టీ బాటపట్టారు బీజేపీ ఎమ్మెల్యే సౌమోన్‌ రాయ్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ లో చేరారు.

ఇప్పటికే ముకుల్‌ రాయ్‌, తన్మయ్‌ ఘోష్‌, విశ్వజిత్‌ దాస్‌లు బీజేపీని వీడి టీఎంసీలోకి వెళ్లారు. ఇప్పుడు కలియగంజ్‌ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సౌమెన్‌ రాయ్‌ అధికార పార్టీ కండువా కప్పుకున్నారు.

Celebrities Costly Bikes: ఎంఎస్ ధోనీ నుంచి మాధవన్ వరకూ సెలబ్రిటీలు లక్షలు పోసి కొనుక్కున్న బైక్‌లివే..

‘రాష్ట్ర అభివృద్ధితో పాటు, ఉత్తర బెంగాల్‌ అభివృద్ధి కోసం పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నా’ అని సౌమెన్‌ రాయ్‌ తెలిపారు. ఈయనతో కలిపి టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య మొత్తం నాలుగుకు చేరింది. వీరంతా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన వారే. బీజేపీ అధికారంలోకి వస్తుందనే హైప్‌ రావడంతో వారంతా మమతను వదిలేసి వెళ్లారు. ఇప్పుడు మళ్లీ సొంతగూటికి చేరుతున్నారు. వీరిని చూసి మరికొందరు బీజేపీ ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరే అవకాశం ఉందని సమాచారం. ఒకప్పుడు తృణమూల్‌లో ఉన్నవారంతా ఇప్పుడు మళ్లీ వచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఉప ఎన్నికల వేళ ఈ పరిణామం బీజేపీపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tambulam : భోజనం తరువాత తాంబూలం వేసుకోవటం మంచిదేనా!..

ఇటీవల 294 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాలు గెల్చుకుని అధికారం కైవసం చేసుకుంది. బీజేపీ 77 స్థానాలకే పరిమితమైంది.