Crackers తిని మరో ఏనుగు చనిపోయింది!

  • Published By: Subhan ,Published On : June 3, 2020 / 03:45 PM IST
Crackers తిని మరో ఏనుగు చనిపోయింది!

కేరళలో గర్భిణీ ఏనుగు చనిపోయిన ఘటన విని యావత్ దేశమంతా విచారం వ్యక్తం చేస్తుంది. పేలుడు పదార్థాలు పెట్టిన పైనాపిల్‌ తిని చనిపోయింది మొదటి ఏనుగు కాదని అంటున్నారు ఫారెస్ట్ అధికారులు. కొల్లామ్ జిల్లాలో మరో ఆడ ఏనుగు ఇదే తరహాలో చనిపోయిందని అంటున్నారు. ఏనుగు పోస్టుమార్టంలో దవడకు గాయాలు అయినట్లు తేలింది. 

‘అది తిన్న ఆహారం ఏదో మొత్తానికి పేలి ఉండాలి’ అదేంటో ఇప్పటికీ నిర్థారణ కాలేదు. అటవీశాఖ అధికారులు కెమికల్ అనాలసిస్ రిపోర్టులు వస్తేనే కానీ, తెలియదని అంటున్నారు. ‘అవి కూడా క్రాకర్స్ గానే అనుమానిస్తున్నట్లు సీనియర్ ఫారెస్టు అధికారి అన్నారు. పఠాన్‌పురం అడవులలో తిరుగుతున్నట్లుగా గుర్తించి అక్కడికి వెళ్లారు. 

‘అది చాలా బలహీనమైపోయింది. దానిని మేం సముదాయించలేకపోయాం. ట్రీట్‌మెంట్ ఇచ్చేందుకు ప్రయత్నించాం. కానీ, మా నుంచి దూరంగా కొద్ది కిలోమీటర్ల దూరం వెళ్లిపోయింది. రెండో రోజు ఉన్నట్లుండి పడిపోయింది’ అని అన్నారు. 

కొల్లాం జిల్లా ప్రాంతాల్లో తమ పంటలు కాపాడుకునేందుకు క్రాకర్స్ పెట్టి ఏనుగులను భయపెడుతూ ఉంటారు. అలా పైనాపిల్ పెట్టిన ఏనుగునే తిని ఉండొచ్చని అటవీశాఖఅధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన విని మోహన్ కృష్ణన్ అనే ఫారెస్ట్ ఆఫీసర్ ఫేస్‌బుక్‌లో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. 

‘దానిని మేం చూసినప్పుడు నదిలో నిలబడి ఉంది. తలని నీళ్లలో ముంచేసింది. అప్పుడే తెలిసిపోయినట్లుంది. తాను చనిపోతున్నట్లు సిక్స్త్ సెన్స్ చెప్పుండొచ్చు. తనకు తానుగా నిలబడే జలసమాధి చేసుకుంది’ ఫారెస్ట్ ఆఫీసర్ మోహన్ కృష్ణన్ అన్నారు.