ఢిల్లీ-ఘాజీపూర్ సరిహద్దుల్లో మరో రైతు మృతి.. 38వ రోజుకు చేరిన అన్నదాతల ఆందోళన

ఢిల్లీ-ఘాజీపూర్ సరిహద్దుల్లో మరో రైతు మృతి.. 38వ రోజుకు చేరిన అన్నదాతల ఆందోళన

Delhi-Ghazipur-border

Another farmer killed on Delhi-Ghazipur border : ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు 38వ రోజు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతుండడంతో రైతులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. రైతుల మరణాల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీ-ఘాజీపూర్ సరిహద్దుల్లో మరో రైతు మరణించారు. ఉత్తర్ ప్రదేశ్‌ కు చెందిన 57 ఏళ్ల రైతు గల్తన్ సింగ్ తోమర్ గుండెపోటుతో చనిపోయారు. దీంతో ఆందోళనలు చేస్తూ మరణించిన రైతుల సంఖ్య 43కి చేరింది.

అటు సింఘు, టిక్రి, ఘాజీపూర్, చిల్లా సరిహద్దుల్లో రైతులు నిరసన వ్యక్తంచేస్తున్నారు. వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలని, పంటల మద్దతు ధరకు చట్ట బద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ చట్టాల రద్దుకు ప్రత్యామ్నాయం లేదంటున్నారు రైతు సంఘాల నేతలు. ఎల్లుండి జరిగే ఏడో విడత చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దృష్టిపెట్టారు.

ఈ మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ప్రెస్ క్లబ్‌ లో రైతు సంఘాల నేతలు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. చట్టాల రద్దు సాధ్యం కాదని… కేంద్రం మొండిపట్టు పట్టడం సరికాదంటున్నారు. ఆందోళనలు ఉధృతం చేసే దిశగా..అన్ని జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి.