కోవిడ్ క్లస్టర్ గా మారిన మరో లగ్జరీ హోటల్…20మంది సిబ్బందికి పాజిటివ్

కోవిడ్ క్లస్టర్ గా మారిన మరో లగ్జరీ హోటల్…20మంది సిబ్బందికి పాజిటివ్

Luxury Hotel In Chennai Becomes Covid Cluster చెన్నైలోని మరో స్టార్ హోటల్ కోవిడ్ క్లస్టర్ గా మారింది. “ది లీలా ప్యాలెస్”స్టార్ హోటల్ లోని 20మంది సిబ్బందికి కరోనావైరస్ సోకినట్లు సోమవారం(జనవరి-4,2020)తమిళనాడు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్ లో 232మంది సిబ్బందికి టెస్ట్ లు చేయగా…అందులో 10శాతం మందికి పాజిటివ్ గా తేలినట్లు సోమవారం సీనియర్ ఆరోగ్యశాఖ అధికారి ఒకరు తెలిపారు. దీంతో, ఇటీవల కాలంలో చెన్నైలో కోవిడ్ క్లస్టర్ గా మారిన రెండవ లగ్జరీ హోటల్ గా “ది లీలా ప్యాలెస్” నిలిచింది.

శనివారం చెన్నైలోని ఐటీసీ హోటల్ లో 85మంది సిబ్బంది,వారి కుటుంబసభ్యులు,పొరుగింటివాళ్లు కరోనాబారినపడిన విషయం తెలిసిందే. రాష్ట్రప్రభుత్వం విధించిన నియమనిబంధనలు అన్నింటినీ తాము ఫాలో అవుతున్నామని,అదేవిధంగా తాము తమ సొంత హైజీన్(పరిశుభ్రత)నిబంధనలు పాటిస్తున్నాయని హోటల్ అధికారులు చెబుతున్నప్పటికీ ఐటీసీలోని అందరినీ కవల్ చేసేలా మరియు సిటిలోని అన్ని హోటల్స్ లో శ్చాచురేషన్ టెస్ట్ కు తమిళనాడు ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.

అధికారులు తెలిపిరన ప్రకారం..చెన్నై వ్యాప్తంగా హోటల్స్ లో మొత్తం 6,416మంది ప్రత్యక్ష్యంగా ఉద్యోగం చేస్తుండగా..ఇందులో 68శాతం(4,392)సిబ్బంది కరోనాబారినపడ్డారు. సిటీలోని హోటల్స్ లో జరిగే అన్ని బిజినెస్ మీటింగ్స్,ఈవెంట్స్ ని దగ్గరగా మానిటరింగ్ చేస్తు్ననట్లు అధికారులు తెలిపారు. అన్ని హోటళ్ల నివాసితులకు శ్యాచురేషన్ టెస్ట్ నిర్వహించాలని చెన్నై కార్పొరేషన్ అధికారులను ఆదేశించినట్లు ఇటీవల తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి జే రాధాక్రిష్ణన్ తెలిపారు.