Corona Virus: కరోనా మూడో వేవ్ ఇక లేనట్లేనా? అరుదైన రికార్డుకు అడుగు దూరంలో!

దేశవ్యాప్తంగా కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వరుసగా ఐదో రోజు కరోనా కేసుల సంఖ్య తక్కువగానే నమోదైంది.

Corona Virus: కరోనా మూడో వేవ్ ఇక లేనట్లేనా? అరుదైన రికార్డుకు అడుగు దూరంలో!

Covid 19

Vaccination: దేశవ్యాప్తంగా కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వరుసగా ఐదో రోజు కరోనా కేసుల సంఖ్య తక్కువగానే నమోదైంది. ఎనిమిది నెలల తర్వాత, అతి తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి.

లేటెస్ట్‌గా ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మంత్రిత్వ శాఖ ప్రకారం, గత 24 గంటల్లో 13,058 కొత్త కరోనా కేసులు మాత్రమే వచ్చాయి. ఇదే సమయంలో 164మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 19వేల 470 మంది కరోనా నుంచి కోలుకున్నారు అంటే 6576 యాక్టివ్ కేసులు తగ్గాయి.

కరోనా సోకుతున్న, కోలుకుంటున్న వారి లెక్కల ప్రకారం చూస్తే కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశమే లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరగడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని అభిప్రాయపడుతున్నారు వైద్య నిపుణులు.

భారత్ కూడా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో అరుదైన రికార్డుకు అడుగు దూరంలోనే ఉంది. దేశంలో ఇప్పటివరకు 99కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. 100కోట్ల డోసుల మైలురాయి దిశగా భారత్ వేగంగా కదులుతోంది. చైనా తర్వాత 100కోట్ల వ్యాక్సిన్లు వేసిన రెండో దేశంగా భారత్‌ అరుదైన రికార్డు క్రియేట్ చేయనుంది.

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 12కోట్లకు పైగా డోసులు వేసి అగ్రస్థానంలో ఉండగా.. 9.21కోట్ల డోసులు వేసి మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది. పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌, కర్ణాటక, రాజస్తాన్ రాష్ట్రాల్లో 6 కోట్ల డోసులను వేశారు.