Kempegowda Airport: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో మరో‘సారీ’.. భద్రతా లోపంతో దారితప్పిన ప్రయాణికులు
వారికి సంబంధించిన లేగేజీలు పొందే విషయంలో గందరగోళం ఏర్పడింది. టర్మినల్‌లో పర్యవేక్షించి సీఐఎస్‌ఎఫ్, ఇమ్మిగ్రేషన్ అధికారులు కాసేపటికి ఇది గమనించారు. వెంటనే వారిని ఇంటర్నేషనల్ ఎగ్జిట్ వైపు తరలించారు. అక్కడే వారి లగేజీని పొందేలా చర్యలు తీసుకున్నారు. భారీ తప్పిదంపై ఎయిర్‌పోర్ట్ అధికారులు స్పందించారు.

Kempegowda Airport: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో తరచూ తప్పిదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా 30మంది శ్రీలంక ప్రయాణీకులు డొమెస్టిక్ ఎగ్జిట్‌లో బయటకు వచ్చారు. ఎయిర్‌పోర్ట్‌లో నేషనల్, ఇంటర్నేషనల్ ప్రయాణీకులకు ప్రవేశంతో పాటు బయటకు వచ్చే మార్గాలు ప్రత్యేకంగా ఉంటాయి. కాగా, శుక్రవారం శ్రీలంక రాజధాని కొలంబో నుంచి 30 మంది ప్రయాణీకులు బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అయితే వారు బయటకు వచ్చే బస్సు ఇంటర్నేషనల్ ఎగ్జిట్ మార్గంలో కాకుండా డొమెస్టిక్ మార్గంలో వచ్చింది. 173 మంది ప్రయాణీకులలో ఓ బస్సులో ప్రయాణించిన 30మందిని డొమెస్టిక్ మార్గంగా బయటకు వచ్చారు.
TSRTC: సందడిగా టీఎస్ఆర్టీసీ కానిస్టేబుళ్ల శిక్షణ ముగింపు కార్యక్రమం
వారికి సంబంధించిన లేగేజీలు పొందే విషయంలో గందరగోళం ఏర్పడింది. టర్మినల్‌లో పర్యవేక్షించి సీఐఎస్‌ఎఫ్, ఇమ్మిగ్రేషన్ అధికారులు కాసేపటికి ఇది గమనించారు. వెంటనే వారిని ఇంటర్నేషనల్ ఎగ్జిట్ వైపు తరలించారు. అక్కడే వారి లగేజీని పొందేలా చర్యలు తీసుకున్నారు. భారీ తప్పిదంపై ఎయిర్‌పోర్ట్ అధికారులు స్పందించారు. ఈ గందరగోళానికి మానవ తప్పిదమే కారణమని అన్నారు. అయితే ప్రయాణీకులందరినీ మరోసారి ఇంటర్నేషనల్ ఎగ్జిట్ మార్గంగానే పరిశీలించి పంపామని, ప్రస్తుతం ఎటువంటి సమస్యా లేదని వివరణ ఇచ్చారు. కాగా ఈ ఏడాది ఆరంభంలో బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లే గోఫస్ట్ విమానం 50 మంది ప్రయాణీకులను ఎయిర్‌పోర్ట్‌లోనే వదిలేసి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారికోసం ప్రత్యేక విమానాన్ని సమకూర్చడం దేశంలో చర్చనీయాంశమైంది.
covid-19: ఒకేరోజు వెయ్యి దాటిన కోవిడ్ కేసులు.. నాలుగు నెలల తర్వాత ఇదే మొదటిసారి