ముఖేష్ అంబానీకి బెదిరింపుల కేసులో ట్విస్ట్‌..సంచలన విషయాలు వెల్లడించిన హిరాన్‌ మన్‌సుఖ్‌ భార్య

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటికి బాంబు బెదిరింపు కేసులో మరో సంచలన విషయం బయటపడింది. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌, అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వాజ్‌తో స్కార్పియో ఓనర్‌ హిరాన్‌ మన్‌సుఖ్‌కి సంబంధాలున్నాయని మన్‌సుఖ్‌ భార్య విమలా బాంబు లాంటి విషయం వెల్లడించింది.

ముఖేష్ అంబానీకి బెదిరింపుల కేసులో ట్విస్ట్‌..సంచలన విషయాలు వెల్లడించిన హిరాన్‌ మన్‌సుఖ్‌ భార్య

A twist in the case of threats to Mukesh Ambani : రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటికి బాంబు బెదిరింపు కేసులో మరో సంచలన విషయం బయటపడింది. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌, అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వాజ్‌తో స్కార్పియో ఓనర్‌ హిరాన్‌ మన్‌సుఖ్‌కి సంబంధాలున్నాయని మన్‌సుఖ్‌ భార్య విమలా బాంబు లాంటి విషయం వెల్లడించింది. పైగా తన భర్త హత్య వెనుక పోలీసు ఆఫీసర్ సచిన్ వాజ్ ఉన్నట్టు విమల ఆరోపిస్తున్నారు.

ఎఫ్ఐఆర్ లో ఆమె ప్రస్తావించిన అంశాలు ఇప్పుడు వెలుగులోకివచ్చాయి. మన్‌సుఖ్‌కి సచిన్‌ వాజ్‌ ముందే తెలుసని.. తమ స్కార్పియో కారును కూడా సచిన్‌ వాడినట్లు తెలిపింది. అయితే సచిన్‌ వాజ్‌ ఇప్పటిదాకా దీన్ని ఎందుకు దాచిపెట్టారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మన్‌సుఖ్‌ అతనికి ముందు నుంచే తెలిసినప్పుడు ఏదో సంబంధంలేని వ్యక్తిగా సచిన్ దర్యాప్తు చేస్తున్నట్లు అర్ధమవుతోంది.

గత నవంబర్‌లో తమ కారును సచిన్ వాజ్‌ తీసుకున్నాడని విమలా చెబుతోంది. ఆ కారును గత ఫిబ్రవరి 5న మన్‌సుఖ్‌ నడిపే గ్యారేజ్‌కు సచిన్ పంపినట్లు విమలా వెల్లడించింది. ఫిబ్రవరి 17న మన్‌సుఖ్‌ ఆ కారుతో బయటకు డ్రైవ్‌కు వెళ్లినప్పుడు స్కార్పియోను ఎవరో దొంగలించినట్లు తెలిపింది. సచిన్ వాజే వేధింపుల వల్లే తన భర్త చనిపోయాడని విమలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త మరణానికి రెండు రోజుల ముందు తనను పోలీసులు వేధిస్తున్నారని తనతో చెప్పాడని ఆమె చెప్పింది. ఈ స్టేట్ మెంట్ ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

అసలు మన్‌సుఖ్‌ స్కార్పియో కారు వాడుతున్న విషయాన్ని సచిన్ వాజ్ ఎందుకు దాచి పెట్టాడు ? మార్చి 4న మన్‌సుఖ్‌కు కాల్‌ చేసిన పోలీసు అధికారి ఎవరు ? ఆ తర్వాత రోజే మన్‌సుఖ్ శవంగా ఎలా మారాడు ? దీని వెనుక రాజకీయ కుట్ర దాగుందా? సచిన్‌ వాజ్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం రక్షిస్తోందా? అనే కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టనుంది.

ఇప్పటికే సచిన్‌ వాజ్‌ను ఉద్దవ్‌ థాక్రే ప్రభుత్వం కాపాడాలని ప్రయత్నిస్తుందని బీజేపీ ఆరోపిస్తోంది. సాక్ష్యాధారాలను నాశనం చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సచిన్‌కు అవకాశం ఇచ్చిందని బీజేపీ ఆరోపణలకు విమలా వ్యాఖ్యలతో మరింత బలం చేకురినట్టైంది. సచిన్‌వాజ్‌ ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అని.. అందుకే మహా సర్కార్ అతడిని రక్షిస్తుందని బీజేపీ మొదటి నుంచి వాదిస్తోంది. అసలు అతడిని ఎలా ఫోర్స్‌లోకి తీసుకున్నారని ప్రశ్నిస్తోంది. అందులో ఈ కేసు సచిన్‌ వాజ్‌ డీల్ చేస్తుండడంపై మొదటి నుంచి బీజేపీ తప్పుపడుతోంది.