Satyendar Jain Video: ఇది జైలు కాదు.. రిసార్ట్..! జైలు నుంచి సత్యేంద్ర జైన్ మరో వీడియో విడుదల

మనీలాండరింగ్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ప్రభుత్వ మంత్రి సత్యేంద్ర జైన్ ను మరోవివాదం చుట్టుముట్టింది. ఇప్పటికే జైలులో సిబ్బందితో కాళ్లు పట్టించుకుంటున్నాడంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

Satyendar Jain Video: ఇది జైలు కాదు.. రిసార్ట్..! జైలు నుంచి సత్యేంద్ర జైన్ మరో వీడియో విడుదల

Stayendra Jain

Satyendar Jain Video: మనీలాండరింగ్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ప్రభుత్వ మంత్రి సత్యేంద్ర జైన్ ను మరోవివాదం చుట్టుముట్టింది. ఇప్పటికే జైలులో సిబ్బందితో కాళ్లు పట్టించుకుంటున్నాడంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అదిమర్చిపోయేలోపు తాజాగా మరో వీడియో జైలు నుంచి బయటకువచ్చింది. ఈ వీడియోలో సత్యేందర్ జైన్ స్పెషల్ ఫుడ్ తింటూ కనిపించారు. ఈ వీడియోను విడుదల చేస్తూ.. ఇది జైలులా కాకుండా రిసార్ట్‌లా ఉందని బీజేపీ విమర్శలు చేసింది.

AAP Minister Satyendra Jain Massage : తీహార్ జైల్లో ఆప్ నేత సత్యేంద్రజైన్‌కు మసాజ్ వ్యవహారం .. మంత్రికి మసాజ్ చేసింది ఎవరంటే..

బీజేపీ విడుదల చేసిన ఈ వీడియోలో సత్యేందర్ జైన్ బెడ్‌పై మూడు వేర్వేరు బాక్స్‌లు కనిపిస్తున్నాయి. అందులో వివిధ రకాల వంటకాలు ఉన్నాయి. వీటితోపాటు సత్యేంద్ర జైన్ కూడా పండ్లు తింటూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఎన్నికల ముందు సత్యేందర్ జైన్ వీడియో వెలుగులోకి రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కొంత అసౌకర్యానికి గురవుతున్నారు. ఇప్పటికే జైలులో సత్యేందర్ జైన్ మసాజ్ వీడియోపై విమర్శలు గుప్పించిన బీజేపీ.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (వినయ్ కుమార్ సక్సేనా)కి ఈ విషయంపై దర్యాప్తు చేయాలని లేఖ రాసింది. అయితే, బీజేపీ విమర్శలపై ఆప్ నేతలు స్పందించారు.. సత్యేందర్ జైన్ అనారోగ్యంతో ఉన్నారని, ఫిజియోథెరపీ చేయించుకోవాలని డాక్టర్ అడిగారని, అందుకే మసాజ్ చేస్తున్నారని సిసోడియా పేర్కొన్నారు.

మనీష్ సిసోడియా వాదన తర్వాత, మసాజ్ చేస్తున్న వ్యక్తి ఫిజియోథెరపిస్ట్ కాదని, మైనర్‌పై అత్యాచారం చేసిన నిందితుడని మంగళవారం వెల్లడైంది. ఈ వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇదిలాఉంటే జైలులో ఉన్న మంత్రి 8కేజీలు పెరిగాడని జైలు వర్గాలు చెబుతుంటే.. సత్యేంద్ర లాయర్ మాత్రం అందుకు విరుద్దంగా వ్యాఖ్యానించాడు. సత్యేంద్ర జైలుకొచ్చిన తరువాత 28 కిలోలు తగ్గాడని అతని లాయర్ పేర్కొనడం గమనార్హం.