ఈ నెక్లెస్ ధరిస్తే..కరోనా రాదంట

  • Published By: madhu ,Published On : July 13, 2020 / 07:46 AM IST
ఈ నెక్లెస్ ధరిస్తే..కరోనా రాదంట

ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తోంది. ఎంతో మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. లక్షలాది మంది చనిపోతున్నారు. ఈ వైరస్ ను అరికట్టేందుకు పాలకులు చర్యలు తీసుకుంటున్నారు. కానీ..దీనికి మందు ఇంకా కనిపెట్టకపోవడం అందర్నీ కలిచివేస్తోంది. ఎంతో మంది శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు శ్రమిస్తున్నారు. అయితే…తాము తయారు చేసిన నెక్లెస్ ను ధరిస్తే..మాత్రం కరోనా వైరస్ రాదు..వచ్చినా నశింప చేస్తోంది అంటున్నారు. ఇండోనేషియాకు చెందిన ఆరోగ్య పరిశోధన, అభివృద్ధి సంస్థ బాలిట్ బాంగ్తన్ నీలగిరి ఆకులతో యాంటీ వైరస్ నెక్లెస్ ను తయరు చేసింది.
దీనిని మెడలో వేసుకుంటే..కరోనా వైరస్ దరిచేరదని, ఒకవేళ సోకినా..నశించిపోతుందని ప్రకటించింది. దీనిని అక్కడి ప్రభుత్వం ఒకే చెప్పింది. ఈ నెక్లెస్ లను భారీ మొత్తంలో ఉత్పత్తి చేస్తోంది. కరోనా వైరస్ ను చంపడానికి నీలగిరి జాతికి చెందిన 700 రకాల మొక్కలతో తయరు చేయడం జరిగిందని మంత్రి సెహ్రూల్ యాసిన్ లింపో వెల్లడించారు. ఈ నెక్లెస్ పావు గంట ధరిస్తే..42 శాతం వైరస్ ను చంపుతుందని, అరగంట ధరిస్తే..80 శాతం వైరస్ ను చంపేస్తుందని తెలిపారు. తాము ప్రయత్నించి చూడడం జరిగిందని, పలు ప్రాంతాల్లో పర్యటనకు వెళుతున్న సమయంలో ఈ నెక్లెస్ ను ధరిస్తున్నట్లు వెల్లడించారు. ఇది బాగా పనిచేస్తోందని, బాలిట్ బాంగ్తన్ యాంటివైరస్ నెక్లెస్ నే కాదు, నీలగిరి మొక్కలతో ఇన్ హీలర్, శానిటైజర్, క్రీమ్స్, ఆయిల్స్ సైతం రూపొందించింది.
ఈ యాంటీ వైరస్ నెక్లెస్ ను వ్యవసాయ శాఖలోని 20 మంది ఉద్యోగులపై ప్రయోగించామని బాలిట్ బాంగ్తన్ సంస్థ హెడ్ ఫడ్రీ వెల్లడించారు. ఈ నెక్లెస్ ను ధరించాక..శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తొలగిపోతుందని చెప్పారు. అయితే…యాంటీ వైరస్ నెక్లెస్ పని తీరుపై ఇండోనేషియన్ శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు కరోనా వైరస్ కు సరైన మందును కనిపెట్టలేదని, ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా..దీనిని వాడడంలో తప్పేమి లేదని ఎజిక్ మన్ ఇన్ స్టిట్యూట్ ఫర్ మాలిక్యుర్ బయోలజీ డిప్యూటీ డైరెక్టర్ హెరావతి సుడొయో తెలిపారు.