పతాంజలి COVID-19 మందు అమ్మితే చర్యలు తప్పవు: మంత్రి

  • Published By: Subhan ,Published On : June 25, 2020 / 10:26 AM IST
పతాంజలి COVID-19 మందు అమ్మితే చర్యలు తప్పవు: మంత్రి

వారం రోజుల్లో కరోనాను తరిమికొట్టే మందు కనిపెట్టామని ప్రకటించేసిన రామ్ దేవ్ బాబాకు మరో చిక్కు వచ్చి పడింది. రీసెర్చ్ ముగిసేంతవరకూ ప్రకటనలు ఆపేయమని ఆరోగ్య శాఖ సూచిస్తే ఒక మంత్రి అది ఎవరైనా అమ్మినట్లు తెలిస్తే వారి పని అంతే అని వార్నింగ్ ఇస్తున్నారు. రాజస్థాన్ ఆరోగ్యశాఖ మంత్రి రఘు శర్మ మాట్లాడుతూ.. బాబా రామ్ దేవ్ మందు విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదని స్పష్టం చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం క్లినికల్ ట్రయల్స్ చేసుకుంటామని ఎలాంటి ప్రపోజల్ తమ వద్దకు తీసుకురాలేదని చెప్పారు. ఎవ్వరికీ అలాంటి అనుమతులు ఇవ్వలేదని అన్నారు. ‘మనుషులపై ప్రయోగించడం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా చేయకూడని పని. ఒకవేళ ప్రభుత్వ పర్మిషన్ లేకుండా నిర్వహించి.. ప్రజలను మభ్యపెట్టే ఆలోచనతో ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం’ అని హెచ్చరించారు. 

రామ్ దేవ్ స్టేట్‌మెంట్ ఆధారంగా పతాంజలి వార తయారుచేసిన ఆయుర్వేదిక మెడిసిన్ లో ఇమ్యూనిటీ బూస్టర్స్ ఉండడం వల్ల కరోనాను వెంటనే తగ్గించేస్తుంది. అనుమతులు లేకుండా ఆయుష్ మినిస్ట్రీ చేస్తున్న పని అనుమతించ తగ్గేది కాదని మంత్రి అంటున్నారు. పతాంజలి బాబా రామ్ దేవ్ బాబా తాము క్లినికల్ ట్రయల్స్ జైపూర్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని చెప్తున్నదంతా అబద్ధమైనా అనే సందేహాలు మొదలయ్యాయి. 

నిమ్స్ డైరక్టర్ డా. అనురాగ్ తోమర్ క్లినికల్ ట్రయల్స్ కోసం అప్రూవల్స్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ‘ఎవరైనా చట్టాన్ని అతిక్రమించే covid-19 మందు అంటూ పతాంజలి డ్రగ్ అమ్మడానికి ప్రయత్నిస్తే వారిపై చర్యలు తప్పవు. క్లినికల్ ట్రయల్స్ పాల్గొనడం అనేది ఐసీఎమ్ఆర్ నేషనల్ ఎథికల్ గైడ్ లెన్స్ కు అనుగుణంగా ఉంటాయి. అవన్నీ రిజిష్టర్డ్ ఆయుష్ డాక్టర్లు నిర్వహిస్తారు’ అని మంత్రి అన్నారు. 

Read: IN-SPACE తో భారత అంతరిక్ష రంగంలో ఇక పెను మార్పులు, రోదసిలో ప్రయోగాలకు ప్రైవేట్ సంస్థలకు కేంద్రం అనుమతి