Lockdown టైంలో బయటికొస్తే రెండేళ్ల జైలు

Lockdown టైంలో బయటికొస్తే రెండేళ్ల జైలు

లాక్‌డౌన్ సమయంలో రూల్స్ బ్రేక్ చేస్తే లాఠీ దెబ్బలు కాదు.. ఏకంగా జైలుకే. అధికారులకు నిత్యవసర సరుకులు తెచ్చుకునేందుకు మాత్రమే తిరగొచ్చని అనుమతిస్తుంటే.. అదే సాకుతో ఆకతాయిలు తిరుగుతూనే ఉంటున్నారు. ఓ వైపు కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ భయం లేకుండాపోతుంది. 

ప్రపంచవ్యాప్తంగా 9లక్షల 32వేల కేసులు నమోదుకాగా, ఒక్క అమెరికాలోనే 2 లక్షల 13వేల 372కేసులు, ఇటలీలో లక్షా 10వేల 574కేసులతో వణుకు పుట్టిస్తున్నాయి. ఇటలీలో మరణాల సంఖ్య 13వేల 155అయితే, స్పెయిన్ లో 9వేల 387మంది ప్రాణాలు కోల్పోయారు. అదే భారత్‌లో 1834కరోనా పాజిటివ్ కేసుల్లో 41మంది మృతి చెందారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీల్లో ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తుంది. 

రెండ్రోజుల డేటా ఆధారంగా చూస్తుంటే తెలుగు రాష్ట్రాంలో కరోనా వ్యాప్తి వేగంగా కనిపిస్తుంది. రాత్రింబవళ్లు కష్టపడుతున్న వైద్యులు, పోలీసులు ఎంతగా చెప్తున్నా.. బాధ్యతారాహిత్యం పెరిగిపోతుంది. అటువంటి వారందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారుల నుంచి ఆదేశాలు అందాయి. 

ఈ మేరకు అకారణంగా లేదా పదేపదే రోడ్లపై తిరుగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శ అజయ్ భల్లా సూచనల మేరకు నిబంధనలు ఉల్లంఘించిన వారికి రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించవచ్చు. కొద్ది రోజుల ముందు లాక్ డౌన్ సమయంలో షాపులు తెరవొద్దని చెప్తున్నా వినకుండా ఓపెన్ చేసిన వారిని జైలుకు తీసుకెళ్లి మందలించారు.