MP RRR: ఫిబ్రవరి 5 తర్వాత రఘురామ రాజీనామా.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ?!

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వచ్చారు.

MP RRR: ఫిబ్రవరి 5 తర్వాత రఘురామ రాజీనామా.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ?!

Rrr

MP RRR: వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వచ్చారు. రఘురామకు నోటీసులు ఇచ్చేందుకు నలుగురు సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని రఘురామ ఇంటికి రాగా.. సీఐడీ అధికారులు జారీ చేసిన నోటిసులపై ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. జనవరి 17వ తేదీన సీఐడీ విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారని వెల్లడించారు.

గతంలో నన్ను అరెస్ట్ చేసే సమయంలో ఇంట్లో సీసీటీవీ కెమెరాలు లేకుండా చేశారని, నా సిబ్బందిపై నాపై వ్యక్తిగత దాడి చేసినట్లు చెప్పారు రఘురామ కృష్ణరాజు. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన వివరాలు సమర్పించానని చెప్పారు. సీఐడీ అధికారి సునీల్ ఒక ఉన్మాదియని, ఇదంతా చూసి ముఖ్యమంత్రి జగన్ ఆనందపడుతున్నాడని అన్నారు.

ఇదే సమయంలో తన ఎంపీ పదవికి రాజీనామా చేసే విషయాన్ని కూడా ప్రకటించారు రఘురామ కృష్ణరాజు. ఫిబ్రవరీ 5వ తేదీ తర్వాత తన పదవికి రాజీనామా చేయనున్నట్లు చెప్పారు రఘురామ కృష్ణరాజు. రాజీనామా తర్వాత ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుంటానని అన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా కానీ ఏదైనా పార్టీ నుంచి కానీ ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు.