Chandrababu Letter To Stalin : ఏపీ రేషన్ రైస్ మాఫియా.. తమిళనాడు సీఎం స్టాలిన్‌కు చంద్రబాబు లేఖ

తమిళనాడు పీడీఎస్ బియ్యాన్ని ఏపీ రైస్ మాఫియా తరలిస్తోందంటూ లేఖ ద్వారా తెలిపారు చంద్రబాబు. ఏయే రూట్లలో రేషన్‌ రైస్‌ మాఫియా అక్రమంగా రైస్‌ను తరలిస్తోందనే విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.

Chandrababu Letter To Stalin : ఏపీ రేషన్ రైస్ మాఫియా.. తమిళనాడు సీఎం స్టాలిన్‌కు చంద్రబాబు లేఖ

Chandrababu Letter To Stalin

Chandrababu Letter To Stalin : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమిళనాడు సీఎం స్టాలిన్ కు లేఖ రాశారు. తమిళనాడు పీడీఎస్ బియ్యంతో ఏపీ రేషన్ రైస్ మాఫియా అక్రమాలను లేఖ ద్వారా స్టాలిన్‌ దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు. తమిళనాడు పీడీఎస్ బియ్యాన్ని ఏపీ రైస్ మాఫియా తరలిస్తోందంటూ లేఖ ద్వారా తెలిపారు చంద్రబాబు. ఏయే రూట్లలో రేషన్‌ రైస్‌ మాఫియా అక్రమంగా రైస్‌ను తరలిస్తోందనే విషయాన్ని లేఖలో ప్రస్తావించారు చంద్రబాబు. స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడ్డ వాహనాలు, స్మగ్లర్ల ఫొటోలను స్టాలిన్‌కు రాసిన లేఖకు జత చేసి పంపారు.

లేఖలో చంద్రబాబు ప్రస్తావించిన ఇతర అంశాలు..

తమిళనాడు పేదలకు చెందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల మీదుగా ఏపీకి తరలిస్తున్నారు.

తమిళనాడు-చిత్తూరు సరిహద్దుల్లోని 7 మార్గాల ద్వారా రైస్ మాఫియా బియ్యం తరలిస్తోంది.

ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో నిఘా సరిగా లేకపోవడంతో రైస్ మాఫియా రెచ్చిపోతోంది.

అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని ఏపీలో రైస్ మిల్లర్లకు పంపుతున్నారు.

రైస్ మిల్లర్లు బియ్యాన్ని పాలిష్ చేసి రైస్ మాఫియాకు పంపి బహిరంగ మార్కెట్‌లో ప్రజలకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

కొంత మొత్తం కర్ణాటకకు కూడా అక్రమంగా తరలిపోతోంది.

Chandrababu On Early Elections : వ్యతిరేకత పెరిగింది, ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో జగన్-చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

తక్కువ ధరకు కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్‌లో కిలో రూ. 40 కు అమ్ముతున్నారు.

దీనికి సంబంధించి నిత్యావసర వస్తువుల చట్టం కింద కుప్పంలో దాదాపు 13 కేసులు నమోదయ్యాయి.

స్థానిక ప్రజలు సైతం చాలామంది స్మగ్లర్లను పట్టుకుంటున్నా.. కేసులు నమోదు కావడం లేదు.

పీడీఎస్ రైస్ అక్రమ దందా భారీ స్థాయిలో జరుగుతోంది.

తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో నిఘా పెంచండి.

రేషన్ రైస్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తమిళనాడు సీఎతో పాటు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా చంద్రబాబు లేఖ రాశారు.