Apollo Hospitals: అపోలో మెగా వ్యాక్సిన్ డ్రైవ్‌.. 200కి పైగా సెంటర్లలో!

జూన్ 30వ తేదీన దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సిన్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు అపోలో హాస్పిటల్స్ మంగళవారం(29 జూన్ 2021) తెలిపింది.

Apollo Hospitals: అపోలో మెగా వ్యాక్సిన్ డ్రైవ్‌.. 200కి పైగా సెంటర్లలో!

Apollo

Apollo Hospitals: జూన్ 30వ తేదీన దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సిన్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు అపోలో హాస్పిటల్స్ మంగళవారం(29 జూన్ 2021) తెలిపింది. దేశంలోని 50నగరాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు 200కి పైగా అపోలో వ్యాక్సిన్ కేంద్రాల్లో టీకా డ్రైవ్ నిర్వహిస్తామని అపోలో హెల్త్‌కేర్ ప్రకటన చేసింది.

టీకాలు వేయించుకోవాలని అనుకుంటున్న ప్రజలు అపోలో 24/7 యాప్ ఉపయోగించి స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. సమీప అపోలో టీకా కేంద్రాన్ని సందర్శించి టీకాలు వేయించుకోవచ్చు. అన్ని టీకా కేంద్రాలలో బౌతికదూరం పాటిస్తూ..వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు 10వేల మందికి పైగా సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు అపోలో చెబుతోంది. సురక్షితమైన టీకా ప్రోటోకాల్స్‌ పాటించేందుకు వారికి శిక్షణ ఇచ్చినట్లు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ శోభ‌నా కామినేని వెల్లడించారు.

“ఈ డ్రైవ్ గరిష్ట సంఖ్యలో వ్యాక్సిన్‌లు వేయడానికి వీలు కల్పిస్తుందని, మూడవ వేవ్ తగ్గించి, మనకు తిరిగి సాధారణ జీవితాన్ని గడిపేందుకు వ్యాక్సిన్‌లు వేయించుకోవడం ముఖ్యమని, అపోలో దీనిపై దృష్టి పెడుతుంది” అని శోభనా కామినేని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ జూలై 2021 నాటికి 500 మిలియన్ల వ్యాక్సిన్లను అందించే లక్ష్యాన్ని సాధించడంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి అపోలో నిబద్ధతలో తన వంతు సాయం చేస్తుందని చెబుతున్నారు. అపోలో హాస్పిటళ్లు దేశవ్యాప్తంగా 72 ఆసుపత్రులలో 12వేల పడకలను కలిగి ఉంది.