Apple Watch Series 8: అద్భుత ఫీచర్లతో యాపిల్ వాచ్ సిరీస్ 8.. మహిళల ఆరోగ్యంతో పాటు క్రాష్ డిటెక్షన్ అందుబాటులోకి

యాపిల్ స్మార్ట్ వాచ్ అభిమానులు ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న యాపిల్ వాచ్ 8 సిరీస్ విడుదలైంది. ఈ వాచ్ లో యూజర్లను ప్రమాదంలో కాపాడేందుకు యాక్సిలరోమీటర్ సెన్సార్, మహిళల ovulation(అండోత్సర్గము) గురించి తెలిపే ఫీచర్లు ఉన్నాయి.

Apple Watch Series 8: అద్భుత ఫీచర్లతో యాపిల్ వాచ్ సిరీస్ 8.. మహిళల ఆరోగ్యంతో పాటు క్రాష్ డిటెక్షన్ అందుబాటులోకి

Apple Watch Series 8: యాపిల్ స్మార్ట్ వాచ్ అభిమానులు ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న యాపిల్ వాచ్ 8 సిరీస్ విడుదలైంది. ఈ వాచ్ లో యూజర్లను ప్రమాదంలో కాపాడేందుకు యాక్సిలరోమీటర్ సెన్సార్, మహిళల ovulation(అండోత్సర్గము) గురించి తెలిపే ఫీచర్లు ఉన్నాయి. ఆపిల్ వాచ్ సిరీస్ 8 గత సంవత్సరం ఆపిల్ వాచ్ 7ను అనుసంధానంగా అందుబాటులోకి వచ్చింది. ఇది 41mm, 45mm రెండు పరిమాణాలలో అందుబాటులోకి వచ్చింది. Apple Watch Series 8, Apple Watch SE 2తో పాటు యాపిల్ అల్టా ( Apple Watch Ultra) ను యాపిల్ సంస్థ మార్కెట్ లోకి నూతనంగా విడుదల చేసింది.

Apple Watch Series 8 : ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉంటే.. మీకు జ్వరం ఉందో లేదో చెప్పేస్తుంది..!

అమెరికా క్వాలీఫోర్నియాలో క్యూపార్టినో నగరంలోని యాపిల్ హెడ్ క్వార్టర్స్ లో స్టీవ్ జాబ్స్ థియేటర్ వేదికగా నిర్వహించిన యాపిల్ ఫార్ అవుట్ ఈవెంట్ లో యాపిల్ ఐఫోన్లతో పాటు మూడు రకాల వాచ్‌లను సైతం అందుబాటులోకి తెచ్చింది. తాజాగా అందుబాటులోకిరానున్న యాపిల్ వాచ్ సిరీస్ 8లో మహిళల ఆరోగ్యం, భద్రత, కనెక్టివిటీ కోసం మరిన్ని ఫీచర్లతో వస్తుంది. పెళ్లయిన జంటలు పిల్లల్ని కనేందుకు సిద్ధంగా ఉంటాయి. కానీ ఏ సమయంలో లైంగికంగా కలిస్తే గర్భం ధరించే అవకాశం ఉందో చాలా తక్కువ మందికే అవగాహన ఉంది. ముందుగా స్త్రీ శరీరంలో జరిగే అండోత్సర్గము గురించి తెలుసుకుంటే ఎప్పుడ కలిస్తే గర్భం ధరించడం సులువో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వారికోసమే అండోత్సర్గము అనే ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. టెంపరేచర్ సెన్సార్ తో పాటు హై ఎండ్ ఫీచర్లతో ఆపిల్ వాచ్ 8ని అందుబాటులోకి తెచ్చింది. మహిళల పర్సనల్ డేటా కేవలం వాళ్లు ధరించిన యాపిల్ వాచ్ 8లో నిక్షిప్తమై ఉంటుంది. Apple Watch Series 8 తాజాగా “క్రాష్ డిటెక్షన్”తో వస్తుంది. ఇది కారు ప్రమాదాలకు గురైన వ్యక్తులను గుర్తించగలదు. తర్వాత వారిని అత్యవసర సేవలకు కనెక్ట్ చేస్తుంది. కొత్త గైరోస్కోప్ కార్ క్రాష్‌లను గుర్తించడానికి ఆపిల్ వాచ్ సిరీస్ 8లోని రెండు కొత్త సెన్సార్‌లు, ఇతర అంశాలతో పనిచేస్తుంది.

iPhone 13 Price Drop : ఐఫోన్ 14 లాంచ్ ఈవెంట్.. ఆపిల్ ఐఫోన్ 13 ధర తగ్గిందోచ్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో చెక్ చేశారా?

ఈ వాచ్( యాపిల్ వాచ్ సిరీస్8) బ్యాటరీకి 18గంటల పాటు పనిచేసే సామర్థ్యం ఉంటుంది తక్కువ పవర్ మోడ్‌తో అయితే బ్యాటరీ జీవితాన్ని 36 గంటలు కలిగి ఉంది. ఆపిల్ వాచ్ సిరీస్ 8 నాలుగు రంగులలో వస్తుంది. మిడ్‌నైట్, స్టార్‌లైట్, సిల్వర్ ప్రాజెక్ట్ రెడ్ లలో అందుబాటులో రానుంది. బ్లడ్ ఆక్సిజన్, ECG, స్లీప్ ట్రాకింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లుతో పాటు వాచ్ OS9 యొక్క కొత్త ఫీచర్లు Apple Watch Series 8లో అందుబాటులో ఉంటాయి. అయితే యాపిల్ వాచ్ సిరీస్ 8 ప్రారంభ ధర రూ. 45,900 గా కంపెనీ నిర్ణయించింది.

iPhone 13 Sale Offer : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్‌.. భారీగా తగ్గనున్న ఐఫోన్ 13 ధర.. ఎంతవరకు ఉండొచ్చుంటే?

యాపిల్ వాచ్ సిరీస్ 8తో పాటు యాపిల్ వాచ్ SE 2 కూడా అందుబాటులోకి వస్తుంది. ఇది మూడు రంగులలో వస్తుంది. SE 2 వర్కౌట్, యాక్టివిటీ ట్రాకింగ్, హార్ట్ రేట్ నోటిఫికేషన్‌లు, ఫాల్ డిటెక్షన్, ఎమర్జెన్సీ SOSతో కలిగిఉంటుంది. అసలు SE కంటే 20% వేగవంతమైనదని Apple పేర్కొంది. ఆపిల్ వాచ్ SE 2 ధర రూ. 29,990 వద్ద ప్రారంభమవుతుంది.

Apple Watch : 54 ఏళ్ల వ్యక్తి లైఫ్ మళ్లీ కాపాడిన ఆపిల్ వాచ్.. భార్య ఇచ్చిన గిఫ్ట్ వేలసార్లు అతన్ని కాపాడింది..!

మొట్టమొదటిసారిగా ఆపిల్ ఈ సంవత్సరం వాచ్‌కు సమానమైన ప్రోను విడుదల చేసింది. “యాపిల్ వాచ్ అల్ట్రా” అని పిలవబడే ఇది నీటిలో కూడా అధిక పనితీరును కనబరుస్తుంది. Apple వాచ్ అల్ట్రా బ్యాటరీ 60+ గంటల వరకు ఉండగలదని Apple పేర్కొంది. ఆపిల్ వాచ్ అల్ట్రా తీవ్రమైన చలి మరియు వేడి ఉష్ణోగ్రతలలో పని చేయగలదు. అదనంగా. ఇది WR100 నీటి నిరోధకతతో వాటర్ స్పోర్ట్స్ కోసం రూపొందించబడింది. Apple వాచ్ అల్ట్రా మీ ఉనికిని 600 అడుగుల దూరంలో ఉన్న వ్యక్తులను కూడా సూచిస్తుంది. దీని ధర రూ. 89,900.