Bank Jobs : దరఖాస్తుకు 2 రోజులే గడువు…4,135 బ్యాంక్ ఉద్యోగాలు..

బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలలో ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

Bank Jobs : దరఖాస్తుకు 2 రోజులే గడువు…4,135 బ్యాంక్ ఉద్యోగాలు..

Ibps Po Recruitment

Bank Jobs : ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ద్వారా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. అక్టోబర్ 19న జాబ్ నోటిఫికేషన్ విడుదల కాగా, అక్టోబరు 20 నుండి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. నవంబరు 10 దరఖాస్తు గడువుకు ముగింపు తేది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలలో ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఐబీపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్, మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 4,135 పోస్టులను భర్తీ చేస్తున్నారు. గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ , ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 2021 అక్టోబర్ 1 నాటి 20 ఏళ్లు నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ధరఖాస్తు ఫీజు 850 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 175 రూపాయలుగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు http://www.ibs.in/crp-po-mt-xi/