సీబీఐ వివాదం..నాగేశ్వర్ నియామకంపై సుప్రీంలో పిటిషన్

  • Published By: veegamteam ,Published On : January 14, 2019 / 12:20 PM IST
సీబీఐ వివాదం..నాగేశ్వర్ నియామకంపై సుప్రీంలో పిటిషన్

సీబీఐ తాత్కాలిక డైరక్టర్ గా మన్నె నాగేశ్వరారవుని నియమించడంపై కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతూ..సోమవారం(జనవరి14,2019) ఎన్జీవో కామన్ కాజ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నాగేశ్వరరావుని తాత్కాలిక డైరక్టర్ పదవికి నియమిస్తూ జనవరి 10న కేంద్రప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ను కొట్టివేయాలంటూ ఆ పిటిషన్ లో కామన్ కాజ్ కోరింది. న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ద్వారా ఈ పిటిషన్ దాఖలైంది. డిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 లోని సెక్షన్ 4A ప్రకారం కేంద్రం సీబీఐ రెగ్యులర్ డైరక్టర్ ను నియమించాలని పిటిషన్ లో కామన్ కాజ్ కోరింది.