Bombay High Court : కోవిడ్ పై సర్జికల్ స్ట్రైక్ చేయాలి

కరోనాపై పోరు సర్జికల్ స్ట్రైక్​ లా ఉండాలని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది.

Bombay High Court : కోవిడ్ పై సర్జికల్ స్ట్రైక్ చేయాలి

Bombay High Court

Bombay High Court కరోనాపై పోరు సర్జికల్ స్ట్రైక్​ లా ఉండాలని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన “ఇంటికి సమీపంలో వ్యాక్సినేషన్​” కార్యక్రమం వైరస్​ దరి చేరేవరకు వేచి చూస్తున్నట్లు ఉందని,వైరస్​ విజృంభించే వరకు వేచి చూడకుండా ముందుగానే దానిని అంతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని కేంద్రానికి హైకోర్టు సూచించింది.

కరోనా వైరస్​ అతిపెద్ద శత్రువు. దానిని నివారించాల్సిన అవసరం ఉంది. వైరస్​ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. ప్రభుత్వం సర్జికల్​ స్ట్రైక్​లా వైరస్​పై విరుచుకుపడాలి. మీ దగ్గరకు వచ్చేంత వరకు వేచి చూస్తున్నారు. శత్రువు ప్రదేశంలోకి వెళ్లే ప్రయత్నం చేయడం లేదు అని జస్టిస్​ దిపాంకర్​ దత్​, జస్టిస్ జీఎస్​ కులకర్ణితో కూడిన బాంబే హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కేంద్ర ప్రభుత్వ నూతన వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ధ్రుతి కపాడియా, కునాల్​ తివారీ దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. జాప్యం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఇంటింటికీ వ్యాక్సిన్​ పంపిణీ చేయడం కుదరదని.. ప్రతి ఇంటికి సమీపంలో వ్యాక్సినేషన్​ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కోర్టుకు తెలిపింది కేంద్రం. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. కేరళ, జమ్ముకశ్మీర్​, బిహార్​, ఒడిశా సహా మహారాష్ట్రలోని కొన్ని మున్సిపల్​ కార్పొరేషన్స్​లో ప్రతి ఇంటికీ వ్యాక్సిన్​ పంపిణీ జరుగుతుండగా కేంద్రం ఎందుకు చేయలేకపోతుందని ప్రశ్నించింది.