భూమిలో దొరికిన గుప్తనిధులు ఎవరికి సొంతం? ఎలా పంచుతారు?ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా ఏం చెబుతోంది?

మన పొలాల్లోను..ఇళ్లల్లోను..ఇళ్ల స్థలాల్లోను ఇలా భూముల్లో గుప్తనిధులు దొరికాయనీ..గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయనే వార్తలు వింటుంటాం. కానీ భూముల్లో దొరికిని గుప్త నిధులు ఆ భూమి గలవారికే చెందుతాయా? లేదా ప్రభుత్వానికే చెందుతాయా?

భూమిలో దొరికిన గుప్తనిధులు ఎవరికి సొంతం? ఎలా పంచుతారు?ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా ఏం చెబుతోంది?

Hidden Treasures 

Hidden treasures : మన పొలాల్లోను..ఇళ్లల్లోను..ఇళ్ల స్థలాల్లోను ఇలా భూముల్లో గుప్తనిధులు దొరికాయనీ..గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయనే వార్తలు వింటుంటాం. కానీ భూముల్లో దొరికిని గుప్త నిధులు ఆ భూమి గలవారికే చెందుతాయా? లేదా ప్రభుత్వానికే చెందుతాయా? భూమిలో ఏం దొరికినా..ఆ సొత్తుపై ఆ భూమి యజమానులకు హక్కులు ఉండవా? అలా దొరికిన గుప్త నిధుల్ని ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకుంటుంది? వంటి విషయాలపై ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా ఏం చెబుతోందో తెలుసుకుందాం.

భూముల్లో గుప్తనిధులు దొరికాయని..వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందనే వార్తలు వింటుంటాం. ఈ క్రమంలో తెలంగాణాలోని జనగామ జిల్లా పెంబర్తిలోని ఓ ప్రాంతంలో భూ యజమానులకు గురువారం (ఏప్రిల్ 9,2021) ఓ పాత్రలో బంగారం, వెండి, పగడాలు లభ్యమయ్యాయి. వాటిలో 18 తులాల 7 గ్రాముల బంగారం, 720 గ్రాముల వెండితో పాటు ఇంకా పగడాలు, రాగిపాత్ర లభ్యమయ్యాయి. వాటిని చూసిన భూ యజమానులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు అయ్యారు. కానీ వాటి గురించి ప్రభుత్వ అధికారులకు వెంటనే సమాచారం అందించారు. దీంతో వెంటనే ప్రభుత్వ అధికారులు గుప్తనిధి మొత్తాన్ని స్వాధీనం చేసుకుని తీసుకెళ్లిపోయారు.

ఈ విషయం కాస్తా..ఆనోటా.. ఈనోటా రాష్ట్రమంతా దావానలంలా పాకిపోయింది. ఫలానావారి భూమిలో గుప్తనిధులు దొరికాయంట అంటూ పెద్ద సంచలనంగా చెప్పుకోవటం మొదలుపెట్టారు. ఇదంతా బాగానే ఉంది. అలా భూమిలో దొరికిన ఆ నిధిని ఏం చేస్తారు? భూ యజమానులకు ఇస్తారా? పోనీ కొంచెం శాతం అయినా ఇస్తారా? లేక ప్రభుత్వమే మొత్తం తన ఖజానాకు తరలించేసుకుంటుందా? అనే ప్రశ్న ప్రతీ ఒక్కరికీ వచ్చేస్తుంది. ఎందుకంటే చూస్తూ చూస్తూ అంత సొత్తు ప్రభుత్వానికే చెందుతుంది అంటూ భూ యజమానులు తీవ్రం నిరాశే అవుతుంది.

భూమి వారిదైనప్పుడు దాంట్లో దొరికిన ఆ నిధిపై భూయజమానులకు ఎలాంటి హక్కులు ఉండవా ? అనే అనుమానాలు అందరికీ వచ్చాయి. మరి ఇలాంటి గుప్త నిధుల గురించి చట్టం ఏం చెబుతుందనే ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మీ భూముల్లో కూడా ఇటువంటి నిధులు దొరుకుతాయేమో..అప్పుడు ఏంచేయాలి అనే విషయం తెలియాలి కదూ…

భూమిలోపల దొరికిన ఎలాంటి నిధిపైనా ఎవరికీ హక్కులుండవు. అది వార సత్వ సంపద కిందకే వస్తుంది. అది ప్రభుతానికే చెందుతుంది. ఇందుకు సంబంధించి ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా చట్టంలో పలు నిబంధనలున్నాయి. భూమిలో పాతిపెట్టిన నిధి జాతి వారసత్వ సంపద అయితే.. ఆ సొమ్ముపై ఎవరికీ ఎలాంటి హక్కులు ఉండవు. దాన్ని పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకొంటుంది.

గుప్త నిధుల లభ్యతపై ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా ఏం చెబుతోందంటే..

బ్రిటిషర్లు మన భారత దేశాన్ని పాలించిన రోజుల్లో దేశంలోని ఆలయాలు, రాజులు దాచిపెట్టిన నిధులు నిక్షేపాలపై మొదటి నుంచీ ప్రత్యేక కన్ను వేశారు. అందినకాడికి దోచుకుపోయారు. పలు ఆలయాలను థ్వంసం చేశారు. ఆలయాల్లోను..రాజులు దాచిపెట్టిన నిధుల కోసం వారు 1878లో ఇండియన్‌ ట్రెజర్‌ ట్రోవ్‌ యాక్ట్‌ పేరిట చట్టం చేశారు. స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం దానికి కొన్ని మార్పు లు చేసింది.

దానిప్రకారం ఏదైనా ఒక ప్రాంతంలో, లేదంటే భూమిలో నిధి నిక్షేపాలు లభ్యమైతే అదిఎవరికి చెందాలి? ఎంత వాటా పొందాలి? అన్న అంశాలపై స్పష్టతనిచ్చారు. ఇప్పుడు ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) అదే చట్టాన్ని అమలు చేస్తున్నది. లభ్యమైన గుప్తనిధులు చారిత్రక వారసత్వ సంపదకు చెందినవి (రాచరిక కాలానికి చెందినవి) అయితే.. రాతి ముక్కనుంచి.. రతనాల దాకా..కుండ పెంకుల నుంచి పగడాల దాకా భూమిలో ఏం దొరికినా..వాటిని పూర్తిగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా స్వాధీనం చేసుకొంటుంది. ఆ తరువాత తతంగం అంతా వారే చూసుకుంటారు.

భూమిలో దొరికిన గుప్తనిధులు ఎవరికి సొంతం.. పంపకాలు ఎలా జరుపుతారు?సంపదలో వాటాలు ఎలా?

గుప్తనిధుల పంపకం చాలా పెద్ద తతంగమనే చెప్పాలి. ప్రభుత్వం రంగంలోకి దిగుతుంది. అంటే స్థానిక ప్రభుత్వ అధికారులు ఘటనాస్థలానికి రెక్కలు కట్టుకుని వాలిపోతారు. నిధి దొరికిందని సమాచారం రాగానే మొదట స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులు ఆ నిధిని పంచనామా చేసి కలెక్టర్‌కు స్వాధీనపరుస్తారు. కలెక్టర్‌ అది వారసత్వ సంపదా? లేక పూర్వీకులు దాచి ఉంచినదా? అన్నది నిర్ధారిస్తారు. పూర్వీకులదైతే.. దాని వారసులెవరన్నదానిపై విచారించి సంపదను వాటాలుగా విభజించి పంచుతారు. లభ్యమైన సొమ్ములో 1/5 వంతు భూ యజమానికి అప్పగిస్తారు. ఆ భూమిని యజమాని కాకుండా వేరొకరు సాగుచేస్తుంటే సదరు కౌలుదారులు, నిధిని వెలికితీసిన కూలీలకు 1/5 వంతులోనే కొంత వాటా దక్కుతుంది. గుప్తనిధి లభించిన సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా కాజేయాలని చూస్తే సదరు వారికి జైలు శిక్ష, జరిమానా తప్పవు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్షా, జరిమానా రెండూ పడే అవకాశాలున్నాయి.