Taj Mahal: తాజ్ మహల్ 22 గదుల చిత్రాలను విడుదల చేసిన పురావస్తుశాఖ అధికారులు: గదుల్లో ఏముందంటే!

వివాదానికి కారణమైన 22 గదుల చిత్రాలను పురావస్తుశాఖ వెబ్ సైట్ లో పెట్టినట్లు అధికారులు వెల్లడించారు

Taj Mahal: తాజ్ మహల్ 22 గదుల చిత్రాలను విడుదల చేసిన పురావస్తుశాఖ అధికారులు: గదుల్లో ఏముందంటే!

Taj

Taj Mahal: గత కొన్ని రోజులుగా తాజ్ మహల్ పై తలెత్తిన వివాదం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. తాజ్ మహల్ లోని 22 గదులను తెరవాలంటూ అలహాబాద్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టివేసినప్పటికీ..భారత పురావస్తుశాఖ అధికారులు..తాజ్ మహల్ లోని ఆ 22 గదుల చిత్రాలను విడుదల చేశారు. తాజ్ మహల్ లోని మూసివుంచిన 22 గదుల్లో హిందూ శాసనాలు, దేవతా విగ్రహాలు ఉన్నాయంటూ కొందరు వ్యక్తులు వాదించారు. అయితే ఈ వాదనలపై స్పందించిన భారత పురావస్తుశాఖ అధికారులు.. ఆ గదుల్లో ఏమిలేదని మొదట నుంచి వివరణ ఇస్తూ వచ్చారు. అయినప్పటికీ ఈ మొత్తం వ్యవహారంపై చెలరేగిన వివాదానికి తెరదించేందుకు పురావస్తుశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వివాదానికి కారణమైన 22 గదుల చిత్రాలను పురావస్తుశాఖ వెబ్ సైట్ లో పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. తాజ్ మహల్ లోని మూసి ఉంచిన గదుల గురించి అసత్య ప్రచారాలను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పురావస్తుశాఖ తెలిపింది.

Other Stories: Indian Army Jobs : ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాల భర్తీ

ఇప్పటి వరకు మూసి ఉంచిన గదుల్లో ఎటువంటి శాసనాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. గదులన్నీ ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. పురావస్తుశాఖ వెబ్ సైట్ లో ఉంచిన గదుల తాలూకు చిత్రాలన్నీ తాజా చిత్రలేనని ఆగ్రా పర్యాటకశాఖ అధికారులు వెల్లడించారు. గదుల్లో చిన్నపాటి మరమ్మతులు జరిగాయని, ఆ మరమ్మతులకుగానూ రూ.6 లక్షలు ఖర్చు అయినట్లు పురావస్తుశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ వివాదం ఎలా ఉన్నా, నడి వేసవిలోనూ తీవ్రమైన వేడిని సైతం లెక్కచేయకుండా వేలాది మంది పర్యాటకులు తాజ్ మహల్ వీక్షించేందుకు వస్తున్నట్లు పర్యాటకశాఖ తెలిపింది. శనివారం ఒక్కరోజే 20 వేల మందికి పైగా పర్యాటకులు తాజ్ సందర్శనకు వచ్చినట్లు పర్యాటకశాఖ గణాంకాలు చెబుతున్నాయి.

Other Stories:Sink hole in China : చైనాలో బయటపడ్డ అతిపెద్ద సింక్ హోల్..దాంట్లో అందమైన అడవి