Army Aircraft Crash : బిహార్‌లో కుప్పకూలిన ఆర్మీ విమానం.. పైలట్లు సేఫ్..!

బిహార్‌లోని గయాలో భారతీ ఆర్మీకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ మరొకటి కుప్పకూలింది. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఈ ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయింది.

Army Aircraft Crash : బిహార్‌లో కుప్పకూలిన ఆర్మీ విమానం.. పైలట్లు సేఫ్..!

Army Aircraft Crashes In Bi

Army Aircraft Crash : బిహార్‌లోని గయాలో భారతీ ఆర్మీకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ మరొకటి కుప్పకూలింది. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఈ ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయింది. అదృష్టవశాత్తూ ఎయిర్ క్రాఫ్ట్ లోని ఇద్దరు పైలట్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. వారిద్దరూ సురక్షతంగా బయటపడ్డారు. స్వల్ప గాయాలు మాత్రమే అయినట్టు అధికారి ఒకరు వెల్లడించారు.

భారతీ ఆర్మీ ఆఫీసర్ల ట్రైనింగ్ అకాడామీకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ఇద్దరు పైలట్లతో బయల్దేరింది. పైలట్ ట్రైనింగ్ కోసం టేకాఫ్ కాగా.. కొద్ది క్షణాల్లోనే ఆ ట్రైనింగ్ విమానం బిహార్‌లోని పంట పొలాల్లో సైనిక విమానం కుప్పకూలింది. సమీపంలోని గ్రామ స్థానికులంతా ఘటనా స్థలికి హుటాహుటినా తరలివచ్చారు.

హెలికాప్టర్​​‌లో చిక్కుకున్న​ వారిని సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. అధికారులు అక్కడికి చేరుకున్నారు. విమానం కూలిన ప్రాంతంలో ఎక్కువగా బురద నిండి ఉంది. స్థానికుల సాయంతో విమానాన్ని అధికారులు వెనక్కి నెట్టారు. ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన ఇద్దరు పైలట్లను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం వారిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. పంట పోలాల్లో కుప్పుకూలిన విమానం శిథిలాలను సేకరించారు. ఎయిర్​ క్రాఫ్ట్​ క్రాష్‌కు సాంకేతిక లోపమే కారణమని తేల్చారు. దీనికి సంబంధించిన వివరాలు నిపుణుల పరిశీలన తర్వాత స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. హెలికాప్టర్​ క్రాష్​కు గల కారణాలపై విచారణ చేపట్టినట్టు తెలిపారు.


ఇటీవల ఆర్మీ విమానాలు, విమాన ప్ర‌మాదాలు, హెలికాఫ్ట‌ర్ ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే మేఘావృతమైన ప్రతికూల వాతావరణంలో హఠాత్తుగా భారత ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 14 మంది మృతి చెందారు. ప్రతికూల వాతావరణమే కారణమని త్రివిధ దళాల దర్యాప్తు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

Read Also : NCC Rally : సిక్కు తలపాగతో మోదీ, ఎలక్షన్ స్టంట్ అన్న ప్రతిపక్షాలు!