ఫార్వార్డ్ ఏరియాల్లో పర్యటించిన ఆర్మీ చీఫ్…జవాన్లకు స్వీట్లు,కేకులు

Army chief General Naravane visits forward areas ఆర్మీ చీఫ్ ఎమ్ఎమ్ నరవాణే ఇవాళ(డిసెంబర్-23,2020) తూర్పు లడఖ్ లోని అత్యంత ఎత్తైన రేచిన్ లా సహా పలు ఫార్వార్డ్ ఏరియాలను సందర్శించారు. ఫార్వార్డ్ ఏరియాల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్లతో ఆర్మీ చీఫ్ మాట్లాడారు. ఇదే అశక్తి,ఉత్సాహంతో పనిచేయాలని వారికి ఉపదేశించారు. క్రిస్మస్ నేపథ్యంలో జవాన్లకు స్వీట్లు,కేకులను పంచారు ఆర్మీ చీఫ్.

తీవ్రమైన చలిపరిస్థితుల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని రివ్యూ చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఒక్క రోజు పర్యటన కోసం బుధవారం ఉదయం 8:30గంటలకు ఆర్మీ చీఫ్ లడఖ్ చేరుకున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. దాదాపు ఎనిమిది నెలలుగా తూర్పు లడఖ్ ప్రాంతంలో చైనా-భారత్ మధ్య సైనిక ప్రతిష్ఠంభణ నెలకొన్న నేపథ్యంలో భారతదేశపు మొత్తం మిలటరీ సంసిద్ధతపై నరవాణే రివ్యూ చేశారని ఆర్మీ అధికార వర్గాలు తెలిపాయి.

లైహ్ ప్రధానకేంద్రంగా పనిచేసే 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్..ఎల్ఏసీ,తూర్పు లఢఖ్ లోని తాజా పరిస్థితులను నరవాణేకి వివరించినట్లు తెలిపాయి. కాగా,తూర్పు లడఖ్ లో మైనస్ జీరో ఉష్ణోగ్రతల్లో వివిధ పర్వత ప్రాంతాల్లో దాదాపు 50వేల మంది భారత ఆర్మీ దళాలు నియమించబడ్డాయని అధికారులు తెలిపారు. చైనా కూడా ఇదే సంఖ్యలో వాళ్ల జవాన్లను పర్వత ప్రాంతాల్లో నియమించిందని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు