Terrorists Encounter : టీవీ నటిని హత్య చేసిన ఉగ్రవాదుల హతం..హత్య జరిగిన 24 గంటల్లోనే ఎన్‌కౌంటర్
వీరిలో షాహిద్ ముస్తాక్ భట్ బుద్గాం వాసి కాగా..మరో ఉగ్రవాది ఫర్హాన్ హబీబ్ పుల్వామాలో హికీంపొరా వాసిగా గుర్తించారు. వీరిద్దరు టీవీ నటి అమ్రీన్ హత్యలో నిందితులని కశ్మీర్ ఐజీ విజయ్‌కుమార్ వెల్లడించారు.

Terrorists
terrorists encounter : కశ్మీరీ టీవీ, సోషల్ మీడియా నటి అమ్రీన్ భట్‌ను దారుణంగా హత్య చేసిన ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఆమె హత్య జరిగిన 24 గంటల్లోనే భద్రతా దళాలు వారిని ఎన్‌కౌంటర్ చేశాయి. అవంతిపొరాలోని అగన్‌హజిపొరాలో జరిగిన ఎన్‌కౌంటర్లో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు మృతి చెందారు. వీరిద్దరు స్థానిక ఉగ్రవాదులే అని భద్రతా దళాలు తెలిపాయి.
వీరిలో షాహిద్ ముస్తాక్ భట్ బుద్గాం వాసి కాగా..మరో ఉగ్రవాది ఫర్హాన్ హబీబ్ పుల్వామాలో హికీంపొరా వాసిగా గుర్తించారు. వీరిద్దరు టీవీ నటి అమ్రీన్ హత్యలో నిందితులని కశ్మీర్ ఐజీ విజయ్‌కుమార్ వెల్లడించారు. వీరి వద్ద నుంచి ఒక ఏకే 56 రైఫిల్, నాలుగు మ్యాగ్జైన్లు, ఒక పిస్తోల్‌ను స్వాధీనం చేసుకొన్నారు. వీరిద్దరు ఇటీవలే టెర్రరిస్ట్ క్యాంప్‌లో చేరినట్లు గుర్తించారు.
Terrorist Attack: కాశ్మీర్‌లో కొనసాగుతున్న హింస: టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
శ్రీనగర్‌లోని సౌర ప్రాంతంలో జరిగిన మరో ఎన్‌కౌంటర్లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. దీంతో మొత్తం మూడు రోజుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో 10 మంది ఉగ్రవాదులను దళాలు హతమార్చాయి. వీరిలో ముగ్గురు జైషే మహమ్మద్‌కు చెందినవారు కాగా.. ఏడుగురు లష్కరే ఉగ్రవాదులు.
25వ తేదీన బుద్గాం జిల్లా చదూరలోని తన నివాసంలో ఉన్న అమ్రీన్‌పై రాత్రి 7.55 గంటల సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.