GST తీసుకొచ్చింది జైట్లీనే..

  • Published By: madhu ,Published On : August 24, 2019 / 08:16 AM IST
GST తీసుకొచ్చింది జైట్లీనే..

2017…దేశంలో ఓ విప్లమైన మార్పు వచ్చింది. మోడీ హాయంలో GST (వస్తు వినియోగ సేవల పన్ను) దేశంలో ఒకే పన్ను వ్యవస్థ కిందకు వచ్చింది. అప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ ఉన్నారు. దీనిని చాకచక్యంగా అమలు చేశారు. దానికంటే ముందు..అంటే 2016, నవంబర్ 09న నోట్ల రద్దు కూడా జరిగింది. జీఎస్టీలో నాలుగు శ్లాబ్‌లున్నాయి. ఆయన ఆశించిన రీతిలోనే జీఎస్టీ వసూళ్లు పెరిగాయని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. 

2014లో ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ దీనిని తీసుకొచ్చారు. ఆర్థిక మంత్రిగా ఉన్న జైట్లీకి ఈ పనిని అప్పగించారు మోడీ. వ్యతిరేకించే రాష్ట్రాలను బుజ్జగించేందుకు ఆయన కృషి చేశారు. దేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఒకే తాటిపైకి తీసుకరావడంలో ఆయన సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. 

జీఎస్టీ అమల్లోకి రాగానే..రాష్ట్రాల సరిహద్దులో చెక్ పోస్టుల స్థానంలో ఈ వే బిల్లులను ప్రవేశపెట్టారు. దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే..ఆన్ లైన్‌లో అనుమతులు తీసుకోవడం ద్వారా..రవాణా మరింత వేగవంతమైంది. ఇక జీఎస్టీ రాకముందు.. ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, సీఎస్టీ, స్థానిక పన్నులు అంటూ..ఉండేది. జీఎస్టీ రాకతో సులభతరం అయ్యింది. రానున్న కాలంలో జీఎస్టీ 12 శాతం, 18 శాతం ఉన్న శ్లాబ్‌లను ఒకటిగా చేస్తామని గతంలో జైట్లీ వెల్లడించారు. 

ఆదాయ స్వయం ప్రకటిత పథకాన్ని జైట్లీ ప్రకటించారు. జన్ ధన్ పేరిట పేదలకు బ్యాంకు అకౌంట్లకు శ్రీకారం చుట్టారు. బ్యాంకుల్లో నిరుపయోగంగా ఉన్న ఆస్తులను వెలికి తీసే కార్యక్రమాన్ని కూడా ఆయన హాయంలోనే జరిగాయి.

Read More : జైట్లీ కన్నుమూత : సుప్రీంకోర్టు అడ్వకేట్ గా కెరీర్ ప్రారంభం