Delhi Liquor Scam: అరుణ్ పిళ్లై కస్టడీ 16 వరకు పొడిగింపు.. రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశం

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితుడిగా ఉన్న అరుణ్ పిళ్లై కస్టడీని ఈ నెల 16 వరకు పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం ఆదేశాలిచ్చింది. అరుణ్ పిళ్లై కస్టడీ పొడిగింపు, అతడు గతంలో ఇచ్చిన వాంగ్మూలం ఉపసంహరణపై కోర్టులో విచారణ జరిగింది. పిళ్లై తరఫు న్యాయవాది, ఈడీ తరఫు వాదనలు విన్న కోర్టు పిళ్లై కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Delhi Liquor Scam: అరుణ్ పిళ్లై కస్టడీ 16 వరకు పొడిగింపు.. రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశం

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితుడిగా ఉన్న అరుణ్ పిళ్లై కస్టడీని ఈ నెల 16 వరకు పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం ఆదేశాలిచ్చింది. అరుణ్ పిళ్లై కస్టడీ పొడిగింపు, అతడు గతంలో ఇచ్చిన వాంగ్మూలం ఉపసంహరణపై కోర్టులో విచారణ జరిగింది. పిళ్లై తరఫు న్యాయవాది, ఈడీ తరఫు వాదనలు విన్న కోర్టు పిళ్లై కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

RRR ‘Naatu Naatu Oscars95’ : RRR టీమ్‌ను ఘనంగా సత్కరిస్తాం : మంత్రి తలసాని

ఈ అంశంపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. దీనిపై సాయంత్రం తీర్పు వెలువడింది. ఈ కేసులో అరుణ్ పిళ్లై కస్టడీని మరో మూడు రోజుల పాటు పొడిగించాలని ఈడీ కోరింది. ఈ కేసులో ఇంకా లిక్కర్ పాలసీ హోటల్ సమావేశాలు, డ్రాఫ్ట్ పాలసీ నివేదిక ఫోన్‌కి ఎలా వచ్చిందనే అంశాలపై సౌత్ గ్రూప్‌లోని వ్యక్తులను ప్రశ్నించాల్సి ఉంది. మార్చి 9న బుచ్చిబాబును విచారణకు రావాలని ఈడీ కోరింది. బుచ్చిబాబు మార్చి 15 వరకు సమయం కోరారు. 15న బుచ్చిబాబును ఈడీ ప్రశ్నించబోతుంది. అరుణ్ పిళ్లైతో కలిసి బుచ్చిబాబును విచారించాల్సి ఉంది. వాట్సప్ చాట్స్ గురించి ప్రశ్నించాల్సి ఉంది.

Goa Attack: గోవాలో టూరిస్టులపై కత్తులు, తల్వార్లతో గూండాల దాడి.. స్పందించిన సీఎం

ఈ కేసుపై పిళ్లై న్యాయవాది మాట్లాడుతూ ‘‘ఈ కేసులో ఇప్పటికే ఈడీ పిళ్లైని 29 సార్లు విచారణకి పిలిచింది. 11 సార్లు స్టేట్‌మెంట్ రికార్డు చేసింది. పిళ్ళై ఇప్పటికే ఈ కేసు విచారణకి సహకరించారు. పిళ్ళైని ఇతర నిందితులతో కలిపి ప్రశ్నిస్తే పిళ్ళై న్యాయవాది కూడా విచారణలో ఉండాలి. గత వారం కస్టడీతో కలిపి 36 సార్లు పిళ్ళై కేసు విచారణకి హాజరయ్యరు. హోటల్ రికార్డులు చూపించి లిక్కర్ కేసు పిళ్ళైకి ఆపాదించాలని చూస్తున్నారు.’’ అని కోర్టుకు తెలిపారు. అయితే, కేసు కీలక దశలో ఉన్న సమయంలో పిళ్ళై వాంగ్మూల ఉపసంహరణ చేసుకున్నారని కోర్టుకు ఈడీ తెలిపింది.

Naatu Naatu : నాటు నాటు ఆస్కార్ గెలుపుపై రాజకీయ ప్రముఖుల కామెంట్స్.. మోదీ, జగన్, చంద్రబాబు, కేసీఆర్.. అభినందనలు..

పిళ్ళై విచారణకి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు కూడా ఉన్నాయి. విచారణ సమయంలో పిళ్ళై తోపాటు అతని న్యాయవాదికి అనుమతి ఇవ్వాలన్న వాదనను ఈడీ వ్యతిరేకించింది. ‘‘పిళ్లై తన స్టేట్‌మెంట్ వెనక్కి తీసుకుంటామంటున్నారు. మేం బలవంతం చేసి పిళ్ళై స్టేట్‌మెంట్ రికార్డు చేయలేదు. పిళ్ళై వాంగ్మూలం రికార్డ్ చేసేందుకు మేము నిబంధనలు అన్ని పాటించాం. భయపెట్టి, బలవంతం చేసి పిళ్ళై వాంగ్మూలం తీసుకోలేదు. మొదటిసారి గతేడాది సెప్టెంబర్ 18న పిళ్ళై స్టేట్‌మెంట్ రికార్డు చేసాం. ముడుపుల వ్యవహారంలో పిళ్ళై కీలకపాత్ర పోషించారు. కిక్ బాక్స్ డీల్‌లో ప్రధాన పాత్ర దారి పిళ్ళై. అతడు, బుచ్చిబాబు కలిసి లిక్కర్ పాలసీ రూపకల్పనలో భాగస్వాములుగా ఉన్నారు. బుచ్చిబాబు ఇచ్చిన సమాచారం ఆధారంగా పిళ్ళైని, బుచ్చిబాబును ప్రశ్నించాల్సి ఉంది.

లాయర్ సమక్షంలో పీఎంఎల్ఏ సెక్షన్ 50 ప్రకారం నిందితుల విచారణ జరగదు. 18, సెప్టెబరు 2022లో పిళ్లై పూర్తి స్టేట్‌మెంట్ ఇచ్చారు. సెకండ్, థర్డ్ స్టేట్‌మెంట్లలో కూడా వివరాలు మరోసారి కన్ఫర్మ్ చేశారు. ఆయనను టార్చర్ చేస్తే మిగిలిన స్టేట్మెంట్‌లలో ఎలా కన్ఫర్మ్ చేస్తారు. మార్చి తర్వాతే స్టేట్‌మెంట్ మార్చుకున్నారు. ఆయన స్టేట్‌మెంట్ ఎందుకు మార్చుకున్నారో తెలుసు. బలమైన వ్యక్తిని మేము సమ్మన్ చేసినప్పుడు పిళ్లై తన స్టేట్‌మెంట్ మార్చుకున్నారు. ఆయన వాంగ్మూలానికి సంబంధించి అన్ని ఆడియో, వీడియో రికార్డులు ఉన్నాయని ఈడీ కోర్టుకు తెలిపింది.