Arunachal Pradesh built by China: ఆ గ్రామం చైనాదే.. అంటోన్న ఇండియన్ ఆర్మీ

ఇండియా భూభాగంలో చైనా ఓ గ్రామాన్ని నిర్మించిందని అమెరికా ఇటీవల ఓ రిపోర్ట్ వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్ లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉందంటూ అందులో పేర్కొంది.

Arunachal Pradesh built by China: ఆ గ్రామం చైనాదే.. అంటోన్న ఇండియన్ ఆర్మీ

Arunachalpradesh

Arunachal Pradesh built by China: ఇండియా భూభాగంలో చైనా ఓ గ్రామాన్ని నిర్మించిందని అమెరికా ఇటీవల ఓ రిపోర్ట్ వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్ లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉందంటూ అందులో పేర్కొంది. ఆర్మీ కెపాసిటీ పెంచుకోవటం, ఇతర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సరిహద్దుల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

రీసెంట్‌గా భారత సైనిక వర్గాలు ఆ రిపోర్ట్ పై రెస్పాండ్ అయ్యాయి. చైనా నియంత్రణలోని ప్రాంతంలోనే ఆ గ్రామం ఉన్నట్లు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. ఎగువ సుబాన్‌సిరి జిల్లాలోని గ్రామం.. ఆరు దశాబ్దాలుగా చైనా నియంత్రణలోనే ఉందంటూ భారత సైనిక వర్గాలు స్పష్టం చేశాయి.

‘1959లో అసోం రైఫల్స్​ పోస్ట్​ను ఆక్రమించుకున్న పీఎల్​ఏ అక్కడ తన సైనిక దళాలను మోహరించింది. అప్పటి నుంచి ఆ ప్రాంతం చైనా అధీనంలోనే ఉంది. ఆ తర్వాత అనేక నిర్మాణాలు చేపట్టింది’
– భారత సైనిక వర్గాలు

…………………………………………. : ఆటోలో మహిళపై అత్యాచారయత్నం

అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్)కు సమర్పించిన రిపోర్టులో 100 ఇళ్ల చైనా గ్రామం ఉన్నట్లు అమెరికా రక్షణ శాఖ గుర్తించిందని తెలిపింది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ నివేదికలో.. “సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత్-చైనా మధ్య దౌత్య, సైనిక సంప్రదింపులు కొనసాగుతున్నప్పటికీ నియంత్రణ రేఖ దగ్గర పెరుగుతున్న వాదనలను తొక్కిపట్టేందుకు చైనా వ్యూహాత్మక చర్యలను కొనసాగించింది’’ అని పేర్కొంది.

యూఎస్ నివేదికలో.. గతేడాది జూన్‌లో జరిగిన గల్వాన్‌ ఘర్షణను కూడా అమెరికా రక్షణ శాఖ ప్రస్తావించింది. నలుగురు పీఎల్​ఏ సైనికులకు చైనా అవార్డులు ప్రకటించినట్లు పేర్కొంది. అయితే చైనా వైపు ఎంతమంది చనిపోయారన్నదానిపై స్పష్టత లేదని తెలిపింది. భారత్‌ వైఖరి వల్లే తాము ఎల్‌ఏసీ వెంట సైనిక మోహరింపులు చేపట్టినట్లు చైనా చెబుతోందని అమెరికా రక్షణశాఖ తెలిపింది.

వాస్తవాధీన రేఖ వెంట మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు నిలిపివేయటం సహా భారత్‌ తన సైన్యాన్ని ఉపసంహరించుకునే వరకు తాము వెనక్కి వెళ్లేదిలేదని చైనా పేర్కొన్నట్లు తెలిపింది. అయితే, సైనిక సామర్థ్యం పెంచుకోవటం సహా బహుళ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పెద్దఎత్తున ఎల్​ఏసీ వెంట మౌలిక సదుపాయాలను చైనా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపింది.

…………………………………………….: డ్యూటీ ముగిసిన తర్వాత వేధించారా..ఫైన్ కట్టాల్సిందే