పర్యాటకులే టార్గెట్ : సీఎం బైక్‌ రైడ్‌

అరుణాచల్‌ ప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి అభివృద్ధి చేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమాఖండూ వినూత్న ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా స్వయంగా ఆయనే బైక్‌పై ప్రయాణించారు.

  • Published By: veegamteam ,Published On : October 16, 2019 / 05:53 AM IST
పర్యాటకులే టార్గెట్ : సీఎం బైక్‌ రైడ్‌

అరుణాచల్‌ ప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి అభివృద్ధి చేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమాఖండూ వినూత్న ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా స్వయంగా ఆయనే బైక్‌పై ప్రయాణించారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి అభివృద్ధి చేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమాఖండూ వినూత్న ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా స్వయంగా ఆయనే బైక్‌పై ప్రయాణించారు. ఒంటరిగా 122 కిలోమీటర్లు ప్రయాణం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ ద్వారా తన ప్రయాణానికి సంబంధించిన విషయాలు వెల్లడించారు.   

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పాసిఘాట్‌ ప్రాంతం బైక్‌రైడింగ్‌, సాహస క్రీడలకు ప్రసిద్ధి. ఈ ప్రాంతానికి పర్యాటకుల్ని ఆకర్షించి ప్రోత్సహించేందుకు సీఎం స్వయంగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 650 ద్విచక్రవాహనంపై పర్యటనకు బయలుదేరారు. 122 కిలోమీటర్లు బైక్‌పై ఒంటరిగా ప్రయాణించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యాటకంగా ఆకర్షణీయ ప్రాంతమైన యుంకియాంగ్‌ నుంచి పాసిఘాట్‌ వరకు ప్రయాణించారు. 

తన బైక్‌ ప్రయాణానికి సంబంధించి వీడియో పోస్ట్‌ చేస్తూ.. పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా ప్రయాణం అని ట్వీట్‌ చేశారు. బైక్‌ రైడింగ్‌, సాహస క్రీడలకు ఇది మంచి ప్రదేశం అని తెలిపారు. తన ప్రయాణాన్ని అక్టోబర్ 13న ఉదయం 8గంటలకు యుంగ్‌కియాంగ్‌ నుంచి ప్రారంభించగా, పాసిఘాట్‌ విమానాశ్రయానికి 10.30వరకు చేరుకున్నానని తెలిపారు.