Arvind Kejriwal On Covid: మళ్ళీ మాస్కును తప్పనిసరి చేసే అంశంపై స్పందించిన సీఎం కేజ్రీవాల్

గుజరాత్, ఒడిశాల్లో రెండు చొప్పున ఒమిక్రాన్ బీఎఫ్.7 కేసులు నమోదుకావడంతో ప్రజలు మాస్కు ధరించడాన్ని మళ్ళీ తప్పనిసరి చేస్తారా? అన్న ప్రశ్నకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సూచనల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. కొత్త వేరియంట్, దాని ప్రభావం గురించి కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా తెలుసని అన్నారు. అలాగే, ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్దే నిపుణులు ఉంటారని చెప్పారు.

Arvind Kejriwal On Covid: మళ్ళీ మాస్కును తప్పనిసరి చేసే అంశంపై స్పందించిన సీఎం కేజ్రీవాల్

Arvind Kejriwal On Covid: గుజరాత్, ఒడిశాల్లో రెండు చొప్పున ఒమిక్రాన్ బీఎఫ్.7 కేసులు నమోదుకావడంతో ప్రజలు మాస్కు ధరించడాన్ని మళ్ళీ తప్పనిసరి చేస్తారా? అన్న ప్రశ్నకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సూచనల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. కొత్త వేరియంట్, దాని ప్రభావం గురించి కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా తెలుసని అన్నారు. అలాగే, ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్దే నిపుణులు ఉంటారని చెప్పారు.

అయితే, ఒకవేళ కరోనా మళ్ళీ విజృంభిస్తే దాన్ని ఎదుర్కొనేందుకు పూర్తిగా సన్నద్ధంగా ఉన్నామని కేజ్రీవాల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వాటికి అమలు పరుస్తామని తెలిపారు. ప్రస్తుతానికైతే కరోనా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పారు.

చైనాను వణికిస్తోన్న ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ కు సంబంధించిన ఢిల్లీలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. ప్రస్తుతం 2,500 కరోనా పరీక్షలు చేస్తున్నామని, ఒకవేళ కరోనా మళ్ళీ విజృంభిస్తే ఆ సంఖ్యను లక్షకు పెంచుతామని అన్నారు. కరోనా బాధితుల కోసం 8 వేల బెడ్లు ఉన్నాయని, అయితే, ప్రస్తుతం ఆ సంఖ్య 25,000కు పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని, మొత్తానికి బెడ్ల సంఖ్యను 36,000కు పెంచే సామర్థ్యం ఉందని చెప్పారు.

Maharashtra: గాంధీతో మోదీకి పోలికేంటి? అమృత ఫడ్నవీస్ ‘ఇద్దరు జాతి పితలు’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్