Arvind Kejriwal : కరోనా నుంచి కోలుకున్న కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కోవిడ్-19 నెగిటివ్ వచ్చినట్లు స్వయంగా ట్విట్టర్‌లో తెలిపారు. “కరోనావైరస్ నుండి కోలుకున్న తర్వాత, నేను మీ సేవకు తిరిగి వచ్చాను” అన్నారు

Arvind Kejriwal : కరోనా నుంచి కోలుకున్న కేజ్రీవాల్

Arvind Kejriwal

Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కోవిడ్-19 నెగిటివ్ వచ్చినట్లు స్వయంగా ట్విట్టర్‌లో తెలిపారు. “కరోనావైరస్ నుండి కోలుకున్న తర్వాత, నేను మీ సేవకు తిరిగి వచ్చాను” అని కేజ్రీవాల్ హిందీలో రాశారు. జనవరి 4న, ఢిల్లీ ముఖ్యమంత్రి తనకు కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిందని ‘తేలికపాటి’ లక్షణాలు ఉన్నాయని చెప్పారు. తదనంతరం, సీఎం హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. కాగా ఉత్తరాఖండ్‌లో ర్యాలీ నిర్వహించిన ఒక రోజు తర్వాత అలసటగా ఉండటంతో సీఎం పరీక్షలు చేయించుకున్నారు. ఇక జనవరి 9న చేసిన పరీక్షల్లో ఆయనకు నెగటివ్ నిర్దారణ అయింది. దీంతో సీఎం బయటకు వచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం కరోనా తీవ్రతపై మీడియా సమావేశం నిర్వహించారు.

చదవండి : CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కరోనా

ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో కోవిడ్-19 కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజువారీ పాజిటివ్ రేటు 19.60%కి పెరిగింది, నగరంలో శనివారం 20,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అయితే, హాస్పిటలైజేషన్ రేటు ఈసారి చాలా తక్కువగా ఉంది. ఆసుపత్రులలో చేరిన 1,500 మంది రోగుల్లో 279 మంది రోగులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) లో ఉన్నారు. 27 మంది వెంటిలేటర్‌ పై ఉండగా.. దాదాపు 375 మంది రోగులు ఆక్సిజన్‌పై ఉన్నారు.

చదవండి : Arvind Kejriwal: ఉత్తరాఖాండ్‌లో గెలిస్తే అమరుల కుటుంబానికి రూ.కోటి చొప్పున ఇస్తాం – కేజ్రీవాల్