Drug Case : ఆర్యన్ ఖాన్‌‌కు సమన్లు..మాలిక్ ఆరోపణలపై స్పందించిన NCB

డ్రగ్స్‌ పార్టీ కేసులో బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు సిట్‌ సమన్లు జారీ చేసింది. ఆర్యన్‌తో పాటు మరో ఆరుగురికి సమన్లు జారీ చేయడంతో విచారణకు హాజరవుతున్నారు.

Drug Case : ఆర్యన్ ఖాన్‌‌కు సమన్లు..మాలిక్ ఆరోపణలపై స్పందించిన NCB

Ncb

Aryan Khan : ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ పార్టీ కేసులో బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు సిట్‌ సమన్లు జారీ చేసింది. ఆర్యన్‌తో పాటు మరో ఆరుగురికి సమన్లు జారీ చేయడంతో విచారణకు హాజరవుతున్నారు. సిట్‌ చీఫ్‌గా ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ సంజయ్‌సింగ్‌ వ్యవహరిస్తున్నారు. గత నెలలో ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేసిన  క్రూయిజ్ డ్రగ్ సీజ్ కేసుతో సహా ఆరు కేసులు ఇప్పటికే ఎన్సీబీ ముంబై జోనల్ యూనిట్ నుంచి సిట్ బృందానికి బదిలీ అయ్యాయి. సంజయ్ కుమార్ సింగ్ నేతృత్వంలోని సిట్ బృందంలో 14 మంది విచారణ అధికారులు  ఉంటారు. ఈ కేసుకు సంబంధించిన వివిధ ప్రాంతాలను సిట్ బృందం సందర్శించనుంది. ఎన్పీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేను ఈ కేసు విచారణ నుంచి తప్పించిన తరువాత సిట్‌ దర్యాప్తు చేపట్టింది.  సిట్ బృందం ముంబైలో ఉండడంతో, వచ్చే వారంలో కేసు దర్యాప్తు వేగవంతం అవుతుందని ఎన్సీబీ సీనియర్ అధికారులు తెలిపారు. ఇక ఆర్యన్‌ ఎపిసోడ్‌లో మైస్టర్‌మైండ్‌గా బీజేపీ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ పాటిల్ సిట్‌ విచారణకు హజరయ్యారు. ముంబై పోలీసులు సునీల్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.

Read More : Telangana : పోడు రగడకు ఇక చెక్..న్యాయంగా సాగు చేసుకుంటున్నారో వారికే ఆ భూములు

ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చేసిన తాజా ఆరోపణలపై ఎన్‌సీబీ అధికారులు స్పందించారు. ఆ ఆరోపణలకు తగిన సాక్ష్యాలుంటే ఆయన కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. దుబాయ్, మాల్దీవుల్లో వాంఖడే ఉన్నారని, బీజేపీ నేత మోహిత్ భారతీయతో మాట్లాడారని వాంఖడేపై నవాబ్ మాలిక్ ఆరోపణలు చేశారు. ఆర్యన్‌ ఖాన్‌ అరెస్ట్‌ ఓ కుట్ర అని.. అందులో సమీర్ వాంఖడే పాత్ర ఉందని, నిజానికి ఇది కిడ్నాప్, బలవంతపు వసూళ్లకు సంబంధించిన కేసు అని నవాబ్ మాలిక్ ఆరోపించారు.

Read More : HYD : విదేశాల్లో ఉండి..ఇంట్లో ఫ్యాన్ ఆఫ్ చేయవచ్చు..విద్యార్థినుల ప్రతిభ

క్రూయిజ్ పార్టీలో పాల్గొనేందుకు ఎలాంటి టిక్కెట్టు ఆర్యన్ కొనుగోలు చేయలేదని, ప్రతీక్ గాబ, అమీర్ ఫర్నిచల్‌ వాలాలు ఆర్యన్‌కు క్రూయిజ్ షిప్‌పైకి తీసుకు వెళ్లారని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన ఎన్‌సీబీ.. ఇందుకు తగిన ఆధారాలు ఉంటే నేరుగా కోర్టుకే వెళ్లొచ్చు కదా అని ప్రశ్నించింది. వాంఖడే ఎన్‌సీబీ ఇన్‌ఫార్మర్ కాదని, శామ్ డిసౌతో‌ ఎలాంటి పరిచయాలు  ఆయనకు లేవని తేల్చిచెప్పింది. ఇక మోహిత్ భారతీయే ఈ పథకం సూత్రధారి అని ఆరోపించారు నవాబ్‌. మోహిత్, వాంఖడేలు ఓషివారా ప్రాంతంలోని స్మశాన వాటికలో కలుసుకున్నారన్నారు. అక్కడ పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరా పని చేయకపోవడం వాంఖడే అదృష్టమన్నారు నవాబ్‌ మాలిక్.